పుట:Pranayamamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయవలెను. ఈ రీతిని అంతరికముగను, బాహ్యముగను ప్రాణ ధారణ చేయవచ్చును.

క్రమముగ మొదటి మూడు విధములగు ప్రాణాయామములను చక్కగా అభ్యసించి, విజయప్రాప్తి పొందిన పిమ్మట నాల్గవమాదిరి ప్రాణాయామము సహజముగ అలవడును. మూడవ రకపు ప్రాణాయామములో పరిమాణమును గురించి ఎక్కువ శ్రద్ధవహించ నక్కరలేదు. ఈ స్థితిలో మొట్టమొదటి సారిగనే శ్వాసావరోధము చేయగలుగును; అప్పుడు స్థల కాల సంఖ్యలను దీర్ఘ సూక్ష్మభేదములచే లెక్కించెదరు. కాని, నాల్గవరకపు ప్రాణాయామములో శ్వాసప్రశ్వాసలయొక్క పరిమితులు నిశ్చితమై వున్నప్పటికీ, భిన్నభిన్న దశలలో ఒక్కొక్కటిగ క్రమప్రకారము జయమునుసంపాదించుకొనుచు రావలెను. అంతేగాని, మూడవరకపు ప్రాణాయామములో వలె మొదటి ప్రయత్నములోనే అన్నిదశలయందు జయప్రాప్తి కలుగదు. అటుల అభ్యసించుట కూడ అపాయకారియే, అదిన్నీగాక, ఒక మెట్టుతరువాత మరొకమెట్టుగా ఎక్కుటకుగల కారణము మరొకటి గలదు. అదేదన, యితనికి ఒక్కొక్క చోట ధారణ చేయుటచే ఒక్కొక్కరకపు సిద్ధి లభించును. కావున ఒక్కొక్క దశ సిద్ధించిన పిదప, మరొక దశ సిద్ధించుటకై సాధన చేయ వలెను.

ఇక మూడవ నాల్గవ రకపు ప్రాణాయామములో గల భేదమేదన, మూడవ రకపు ప్రాణాయామములో స్థల, కాల, సంఖ్యాగణనలేదు. అంతేగాక, ఒకేవిధపు ప్రయత్నముతోనే అది సిద్ధించును. కాని, నాల్గవ దానిలో స్థల, కాల, సంఖ్యా గణన వుండుటయేగాక, ఒకదాని తరువాత ఒకటిగా ప్రతిదశ