పుట:Pranayamamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముగ అభ్యసించవలెను. రోజుకు నాల్గు పర్యాయములు అన ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి 9 గం.లకు లేక అర్థరాత్రివేళయందు ప్రాణాయామమును చేయుచుండవలెను. ఇటులచేయుటచే రోజుకు 320 ప్రాణాయామములు చేసినట్లగును. ప్రాణాయామమువల్ల కలుగు ఫలము, నిద్రించుచున్న కుండలినీశక్తి మేల్కొనుటయే. ప్రాణాయామము యొక్క ప్రధానాశయము, ప్రాణమును అపానముతో ఐక్య పరచి, ఇటుల ఐక్యమైన ప్రాణాపానములను మెల్లమెల్లగా తల వైపుకు పంపుటయే.

సమస్తవిధములగు గుప్తమహిమలు, కుండలినీశక్తివల్లనే లభించును. అభ్యసించుకాలము ననుసరించి, దీర్ఘము, హ్రస్వము అని ప్రాణాయామము రెండు విధములు. కాలియున్న పెనముపై నీటిబొట్టు వేసినచో అటుయిటు చిటపట మనుచు ఎగిరి పొవును గదా! అదేరీతిని గాలి కూడ అటుయిటు సంచరించు చుండ (స్వేచ్ఛగ) గాలిని కుంభకమువల్ల, దాని యిచ్ఛవచ్చిన రీతిని పోకుండులాగున చేసినచో, అది లోపలనే ఆగిపోవును.

వాచస్పతి దీనిని గురించి యీరీతిని వర్ణించెను:- "36 మాత్రల పరిమాణముగల మొదటి ప్రయత్నమును సాధారణమనియు, దీనికి రెట్టింపు పరిమాణముగల రెండవ ప్రయత్నమును మధ్యమము అనిన్నీ, దీనికి మూడురెట్లు పరిమాణము గల మూడవ ప్రయత్నమును తీవ్రమనిన్నీ - యీ రీతిని ప్రాణాయామమును సంఖ్యచే గణించెదరు.

బయటకు విడచు గాలి యొక్క దూరము (స్థలము) ముక్కు పుటమునకు పండ్రెండు అందుళములు వుండును. దీనిని ఒక దూదిపింజ లేక రెల్లుగడ్డి సహాయముచే కనుగొన వచ్చును. లోపలికి పీల్చుగాలి యొక్క దూరము (స్థలము) తలనుండి