పుట:Pranayamamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలిగినచో, నీ ఆయువును ఒక నిమిషము అధికము చేసి కొంటివని అర్థము. యోగులగువారు ఈ వాయువును తల యొక్క ఉపరిభాగమున గల, బ్రహ్మరంధ్రమువద్దకు తీసికొని పోయి, యముని ఓడించి మరణమును లేకుండ చేసికొందురు. కుంభకమును అభ్యసించుటవల్ల చాంగదేవుడు 14 వందల సంవత్సరములు జీవించెను. ఈ త్రివిధ ప్రాణాయామములు (రేచక, పూరక, కుంభకములు) స్థల, కాల, సంఖ్యాభేదములపై ఆధారపడివున్నవి. స్థలముఅన, శరీరమునకు బయట, లోపల అనియు, శ్వాసయొక్క పరిమాణముఅనియు, ఒకానొకస్థలమున (శరీరములో) ఆపుజేయబడిన ప్రాణము అనియు అర్థము. గాలిని బయటకువిడచు పరిమాణము, ఒక్కొక్క వ్యక్తియందు ఒక్కొక్క విధముగవుండును. అ దేరీతిని, లోపలికిపీల్చు గాలికూడ ఆ సమయమున వుండు ప్రధానతత్త్వము ననుసరించికూడ ఈశ్వాస యొక్క పరిమాణము మారుచుండును. పృథ్వి, అప్, తేజ, వాయు ఆకాశతత్వములలో శ్వాస వరుసగ 12, 16, 4, 8, 0 ల వ్రేలి అడ్డపుపొడవుల పరిమాణము కలిగివుండును. బయటకు విడచునప్పుడు బయటను, లోపలికి పీల్చునప్పుడు లోపలను ఈ ప్రకారము మరలకూడ అదేవిధముగ వుండును.

కాలపరిమాణమును 'మాత్ర' యను కాలపరిమితిచే లెక్కించెదరు. ఈ 'మాత్ర' యను కాలపరిమితి ఒకసెకండుకు సమానముగవుండును. 'మాత్ర' యను మాటకు కొలత అని అర్థము. ఒకస్థలమున ఎంతవరకు ప్రాణమును ఏకాగ్రముగ నిలిపెదమో, ఆ కాలపరిమితినికూడ 'మాత్ర' యని వాడెదరు.

'సంఖ్య' యన ప్రాణాయామమును ఎన్నిమారులు చేయుదుమో లెక్కించుట. యోగసాధకులు ఒక్కొక్క పర్యాయము 80 ప్రాణాయామములు చేయగలుగు నంతవరకు క్రమక్రమ