పుట:Pranayamamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వశపడును. పులులు, శరభములు, ఏనుగులు, సింహములు మొదలగునవి అన్నియు వశపడుటయే కాదు, అతనిచేతితో తట్టినంత మాత్రమున చచ్చిపోగలవు. ప్రేమ దేవునివలెమిక్కిలి అందగాడుగ అగును. శుక్లధారణవలన యోగి శరీరమునుండి ఒక విధమగు సువాసన బయలుదేరును.

యోగి యొక్క ఆహారము

నీ అంతర్వాణి, నీకు తగిన ఆహారపదార్ధములను ఎంచుకొనుటలో మార్గదర్శి కాగలదు. నీ శరీరమునకు తగిన సాత్వికాహారమును ఎంచుకొనుము. తదితర వివరములకు అనుబంధములో చూడుము.

మితాహారము

సాత్వి కాహారముతో పొట్టలో సగభాగమును నింపుము. మిగిలిన నాల్గవ భాగమును ఖాళీగా వదలము.

ఆహార పారిశుధ్యము

"ఆహారశుద్ధౌ, సత్త్వ శుద్ధి:, సత్త్వశుద్ధౌ, ధృవస్మృతి: స్మృతిలభ్యౌ, సర్వగ్రంధినం విప్రమోక్ష:,"

ఆహార పారి శుధ్యము వలన స్వభావము పవిత్రమగును; పవిత్ర మగు స్వభావము వలన జ్ఞాపకశక్తి ధృడపడును. జ్ఞాపక శక్తి బలపడుట వలన సమస్త బంధములు విడిపోయినవాడై, బుద్ధిమంతుడు అందువలన మోక్షమును పొందును.

భోజనము చేసినవెంటనే ప్రాణాయా మాభ్యాసము చేయరాదు. బాగా ఆకలితో వున్నప్పుడు కూడ అభ్యసించరాదు. ప్రాణాయామమునకు కూర్చొన బోవు ముందు మరుగుదొడ్డికి వెళ్ళి కాల కృత్యములను నెరవేర్చు కొనుము. ప్రాణా