పుట:Pranayamamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యామమును అభ్యసించు వాడు, ఆహార పానీయముల విషయమై తగు కట్టుబాటులను కలిగియుండవలెను.

ఆహార విషయములో (అభ్యాస సమయమున) తగినంత శ్రద్ధ తీసికొనినచో మంచి ఫలితములు కనిపించును. వారికి అతి త్వరగా విజయ ప్రాప్తి కలుగును. చాల కాలము నుంచి మలబద్ధముచే బాధపడు వారును, సాయంత్రములందు మల విసర్జనము చేయు అలవాటు కలిగియున్న వారును, ప్రకృతి పిలుపులకు జవాబివ్వకుండగనే ఉదయమున పెందలకడ ప్రాణాయామమును చేయవచ్చును. ఇట్టివారు ఉదయమున మల విసర్జనముచేయుటకై శక్తికొద్దీ ప్రయత్నించుట మంచిది.

యోగ సాధన చేయువారికి ఆహార విషయికమగు కట్టుబాటు చాల ముఖ్యము.

ప్రారంభ దశలో ఆహార విషయమై చాల ఎక్కువ శ్రద్ధతీసికొనవలెను. ప్రాణాయామము సిద్ధించిన పిమ్మట, ఆహార నియమములను పాటించ నక్కరలేదు.

పాయసము

ఉడికిన తెల్లటి బియ్యమూ, నెయ్యి, పంచదార, పాలు కలసి వండిన పదార్థము బ్రహ్మచారులు, ప్రాణాయామసాధకులకు చాల లాభకారి.

పాలు

పాలను కాచి త్రాగవలెను. కాని ఎక్కువగ మరగనివ్వరాదు. దీనికి గుర్తు: పాలు పొంగు రానారంభించగనే పొయ్యిమీదనుంచి దింపివేయవలెను. ఎక్కువగా కాగుట వలన అందలి బలపర్థక పదార్థములు నశించును. పాలు సరియగురీతిని పుచ్చుకొన్నచో, శరీరమునకు కావలసిన ప్రాణ