పుట:Pranayamamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నప్పటినుండి, యోగియొక్క నిజమగు కార్యక్రమము ప్రారంభమగును. ఇది వెన్నెముకయొక్క మధ్యభాగముగుండ పోవును. బొడ్డుకు క్రిందుగను, జననేంద్రియమునకు పైగను గ్రుడ్డు[పక్షి] ఆకారమువలె నుండు 'కాండము' గలదు. అచ్చటినుండియే డెబ్బది రెండువేల నాడులు బయలుదేరును. వీటిలో డెబ్బది రెండు సాధారణ మైనవిన్నీ, అందరికీ తెలిసినవిన్నీ. వీటిలో పది ప్రధాననాడులు గలవు. ఇవి ప్రాణశక్తిని గొంపోవుచుండును. వీటినే ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, హస్తిజిహ్వ, పూష, యశస్విని, అలంబుస, కుహుశంఖిని అందురు. యోగులు,ఈ నాడులు, చక్రములను గురించి తప్పక తెలిసి కొనవలెను. ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ప్రాణశక్తిని గొంపోవుననిన్నీ, వాటి అధిష్ఠాన దేవతలు చంద్రసూర్యాగ్నులనిన్నీ చెప్పబడెను. సుషుమ్న గుండా ప్రాణము ప్రవహించునప్పుడు ధ్యానమునకు కూర్చొనుము.

సర్వశక్తులకు నిలయమగు కుండలినీ శక్తిని సుషుమ్న ద్వారా చక్రము తరువాత చక్రములోనికి ప్రవహింపజేయుచూ వచ్చినచో, వివిథములగు అనుభవములు, శక్తులు, ఆనందము లభించ గలవు.

కుండలిని *[1]

కుండలిని వెన్నెముకయొక్క మూలంలోగల మూలాధార చక్రంలో 3 1/2 చుట్లు చుట్టుకొని, ముఖమును క్రింది వైపుగా వుంచి నిద్రించుచుండు ఒకశక్తి. ఇది మేల్కొననిదే, సమాధి లాభం కలుగదు.

  1. * పూర్తి వివరములకు నా 'కుండలినీ యోగము' ను చదువుడు.