పుట:Pranayamamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందురు. కాని యివి ప్రాణమును గొంపోవు సూక్ష్మనాళములు. సూర్యుడు పింగళయందును, చంద్రుడు ఇడయందును సంచరించును. ఇడ శితలతను, పింగళ ఉష్ణతను యివ్వగలదు. ఇడ ఎడమ ముక్కుగుండను, పింగళ కుడిముక్కుగు:డను ప్రవహించును. శ్వాస ఒక గంటసేపు కుడిముక్కు గుండను, ఆ తదుపరి ఎడమ ముక్కుగుండ ఒక గంటసేపును ప్రవహించును. ఇడపింగళలగుండ శ్వాస ప్రవహించునప్పుడు మనుష్యుడు ప్రాపంచిక విషయములలో ముణిగి తేలుచుండును.

సుషుమ్నగుండ ప్రవహించ సాగగానే, ప్రాపంచిక విషయము లేమియు లేనివాడై, సమాధిలో ప్రవేశించును. యోగియనువాడు. ఈ ప్రాణవాయువును సుషుమ్నానాడి ద్వారా ప్రవహించులాగునచేయుటకై, తన శక్తి కొద్దీ ప్రయత్నించును. దీనినే కేంద్రీయ బ్రహ్మనాడియనికూడ అందురు. ఈ సుషుమ్నకు ఎడమవైపున ఇడ, కుడివైపున పింగళయు గలదు. చంద్రుడు తమోగుణ స్వభావము, సూర్యుడు రజోగుణ స్వభావము గలవాడు. ఇందు విషభాగము సూర్యునిది, అమృతభాగము చంద్రునిది. ఈ ఇడ పింగళలు కాలమును తెలియజేయును. కాని సుషుమ్నయో, కాలమును లేకుండచేయును.

సుషుమ్న

నాడు లన్నిటిలోనను, సుషుమ్నానాడి అతి ప్రధానమైనది. ఏలనన, జగత్తునంతను భరించునది, మోక్షమార్గమును చూపునదీ, అదియే. ఇది గుదమునకు వెనుక భాగమున ప్రారంభమై, వెన్నెముకను అంటిపెట్టుకొని వుండి, తలయందలి బ్రహ్మరంధ్రమువరకు పోవును. ఇది చూచుటకు వీలుకానంత సూక్ష్మముగ వుండును. సుషుమ్న తన పనిని ప్రారంభించి