పుట:Pranayamamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రసముగా మారి చిన్నప్రేవులందలి క్షీరవాహికలలో ప్రవేశించును.

తిండిపోతులు, విషయలోలురగు వారికి యోగము సిద్ధించదు.

క్రుళ్ళిన, పాసిన, చెడిపోయిన, పులిసిన, శుభ్రముగా లేని, రెండుమారులు వండిన, రాత్రి నిలవవున్న పదార్థములను విసర్జించవలెను. ఆహారము కొద్దిగను, తేలికగ జీర్ణమగు నట్టిదిగను, పుష్టికరమైనదిగను వుండవలెను. తినుట కొరకు జీవించువాడు పాపి, బ్రతుకుటకొరకు తినువాడు యోగి. ఆకలిగావున్నప్పుడు తినిన ఆహారము చక్కగా జీర్ణమగును. ఆకలిలేనప్పుడు ఏమియూ తినవద్దు. పొట్టకు విశ్రాంతి యిమ్ము.

రుచులకై ప్రాకులాడకుము. అర్ధములేని యీ రుచులకై ప్రాకులాడుటవలననే అనేకులు అనేకములగు బాధల ననుభవించుచున్నారు. ఏదైన క్రొత్తస్థలముకు వెళ్ళినప్పుడు నీకు యిష్టమగు పదార్థములు లభించనిచో మిక్కుటమగు వేదన పొందెదవు. ఇదేనా నీ బలము ? ఎందుకిటుల గర్వించెదవు ? నీవు నీ నాలుకకు బానిసవు కాలేదా ? ఇదితప్పు, స్వల్పమగు స్వాభావికాహారమును గై కొమ్ము. సుఖము ననుభవించగలవు. తినుటకై బ్రతుకకుము. బ్రతుకుటకై తినుము. పవిత్రమగు ధ్యానమునకే కాలమును వినియోగించు యోగసాధకునకు చాలకొద్ది ఆహారము చాలును. శేరులేక శేరున్నర పాలు, కొన్ని ఫలములు చాలును. శారీరక పరిశ్రమను కూడ చేయకోరు సాధకునకు ఎక్కువ ఆహారము కావలసివచ్చును.

ఆరోగ్యమును కాపాడుకొనుటకు మాంసము అక్కర లేదు. ఇది ఆరోగ్యమునకు హానికారి. దీనివల్ల నారికురుపు మొదలగు అనేకవ్యాధులు వచ్చును. ఆహారమునకై జంతు