పుట:Pranayamamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ర్థము లావశ్యకములు. వెన్న, జున్ను, మీగడ, ఆలివ్ నూనె, వేరుశనగనూనె, ఆవ నూనెలు యీ పనికి చాల ఉపయోగపడును.

సరియైన ఆహారము శరీరమును అన్ని విధముల కాపాడును. పాలు పూర్ణాహారము. శరీరమునకు కావలసిన పదార్థము లన్నియు దీనియందు గలవు. మాంసకృత్తులు, క్రొవ్వు, పిండి పదార్థములు-యివి తగు నిష్పత్తిలో మనము గై కొను ఆహార మందుండవలెను. ఈ మూడింటిలో ఏ ఒకటి తమ నిష్పత్తిలో హెచ్చు తగ్గులుగా వున్నప్పటికీ, అది శరీరారోగ్య భంగ కారియే. కావున జాగరూకత వహించవలెను. కొందరు కోడి గ్రుడ్డు కాయగూరలవంటి దందురు. ఇది తప్పు, కావున యోగ సాధకులు దీనిని వర్జించవలెను. పాలు, వెన్న, జున్ను, ఫలములు, బాదం పప్పు, బంగాళాదుంపలు, పచ్చిముల్లంగి, Turnip దుంప వీటిలో సమస్త ప్రాణపోషక పదార్థములు గలవు.

ఆహారమును జీర్ణము చేయు ద్రవములలో లాలాజలము నోటియందును, పొట్టలో జఠర రసమును, చిన్నప్రేవులలో పైత్యరసము, ఆంత్రరసమున్నూ ముఖ్యములు. లాలాజలము లాలాగ్రంధులందుండును, ఇది పిండిపదార్థములను జీర్ణమగు నటుల చేయును. జఠర రసములో లవణ ద్రావకము వుండును. ఇది జఠర గ్రంధులందుండును. ఇది మాంసకృత్తులను జీర్ణమగు లాగున చేయును. మధురసము పిండిపదార్థము, మాంసకృత్తు, క్రొవ్వులను జీర్ణము చేయును. పైత్యరసము యకృత్తు నందుండును. ఇది క్రొవ్వు పదార్థములను జీర్ణ మగునటుల చేయును. ఈ పై పదార్థము లన్నిటివల్ల ఆహారపదార్థములన్నియు అన్న