పుట:Pranayamamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవవారము 12 సెకండ్లు ఈ రీతిని పెంచుకొనుచురమ్ము. నీ శక్తి ననుసరించి పెంచుకొనుచు రమ్ము.

43. యుక్తిని వుపయోగించుము. యుక్తి లేనిచో ఏమియులేదు. యుక్తి వున్నచోట సిద్ధి, భుక్తి ముక్తులుగలవు.

44. రేచక పూరక కుంభక పరిమాణములు, సాధనలో శ్రమగా తోచకుండు రీతిని వుండవలెను. సాధన మధ్యలో కొంచెము సేపుఆగి, చేయుదమని అనిపించులాగున వుండరాదు.

45. రేచకమును అనవసరముగ ఎక్కువ పొడగించకుము. అందువల్ల పూరకమును హడావిడిగా చేయవలసి వచ్చును. ఇందుచే క్రమము తప్పును.

46. సూర్యభేది, ఉజ్జయులు ఉష్ణమును కలిగించును. సీత్కారి, శీతలులు చల్లదనము నిచ్చును. భస్త్రిక శీతోష్ణములను సమానముగ వుంచును. సూర్యభేది వాతాధిక్యతను, తొలగించును. ఉజ్జయి శ్లేష్మాధిక్యతను, సీత్కారి శీతలులు పైత్యమును, భస్త్రిక యీ మూడింటి ఆధిక్యమును తగ్గించును.

47. సూర్యభేది, ఉజ్జయులను శీతాకాలమందును, సీత్కారి, శీతలులను ఎండాకాలమందును, భస్త్రికను అన్ని కాలములందును అభ్యసించవచ్చును. అతి ఉష్ణతత్వముతో కూడియుండు శరీరము గలవారు. శీతాకాలములో కూడ సీత్కారి, శీతలులను చేయవచ్చును.

48. జీవితముయొక్క లక్ష్యము ఆత్మజ్ఞానము. ఇది శరీర ఇంద్రియ సంయమము, సద్గురు సేవ, వేదాంత శ్రవణ, ఎడ