పుట:Pranayamamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెగని ధ్యానముచే సిద్ధించును. నీవు అతిత్వరగా లక్ష్యమును చేరగోరుచో, ఆసన, ప్రాణాయామ, జప, ధ్యాన, స్వాధ్యాయాదులను, ప్రతినిత్యము క్రమప్రకారము చేయుచు బ్రహ్మ చర్య పాలనమును చేయవలెను.

"మనస్సును వశపరచు కొనుట,*[1] ఆత్మజ్ఞానము, సత్సంగము, వాననాపరిత్యాగము, ప్రాణమును వశపరచుకొనుట యివి ముక్తినిచ్చును." (ముక్తికోపనిషత్తు)

49. ఆసనము, ప్రాణాయామము, జపము, ధ్యానము, బ్రహ్మవిచారము, సత్సంగము, ఏకాంతము, మౌనము, నిష్కామకర్మ, యివన్నియు అధ్యాత్మికోన్నతికి ఆవశ్యకములని మరొకమారు చెప్పుచున్నాను. హఠయోగము లేకుండా చాలాకష్టపడిననే రాజయోగ సిద్ధి కలుగ గలదు. కుంభకముయొక్క అంతమున మనస్సును ఇంద్రియములనుండి మరల్చవలెను. క్రమక్రమముగ ఇందు సిద్ధి కలుగ గలదు.

50. వేదాంతగ్రంధ పఠనము మాత్రము చేయు కొందరు విద్యార్థులు, తాము జ్ఞానులమని భ్రమపడి ఆసన ప్రాణాయామాదులను త్యజించెదరు. వారుకూడ జ్ఞానయోగమునకు కావలసిన శమదమాది షట్సంపదలు లభించునంత వరకు ఆసనాదులను చేయవలెను.

51. నీ ప్రక్కన కూర్చొని నీకు ప్రతివిషయమును బోధించుటకు గాను గురువెవరూ లభించలేదని వ్యాకులపడ

  1. * దీనిని గురించి పూర్తిగా తెలసికొన గోరువారు నాచేరచింపబడిన 'ముక్తి మార్గము'ను చదువుడు.