పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౧౨

బండిపాటు

మాయూరి కాఱుమైళ్ళు దూరమున అవనిగడ్డయని గ్రామము గలదు. అది తాలుకా ప్రధాన స్ధానము. మాయన్నగా రక్కడ పోస్టుమాస్టరు. వారి కుటుంబమును జుచుటకై నే నాయూరికి వెళ్ళి తిరిగి వచ్చుచుంటిని. మాయూరివారే, మహనీయులు, గొప్ప వేదవేదాంగ వేత్తలు, నాపై నమితవాత్సల్యము గలవారు,వృద్ధులు యత్త గారితో బండిమిఁ ద అవనిగడ్డ నుండి యే మాయూరికి విచ్చేయుచు నన్నుఁ గూడ బండిలోఁ గూర్చుండ నిర్భంధించిరి. నేనేవేవో మద్రాసు పుస్తకసాలలోని గ్రంధములఁ గూర్చి ముచ్చటించుచు వారిని వినోదపఱచుచుంటిని. బండి యొకటిన్నర మైలు సాగి వచ్చెను.

అవనిగడ్డకు మాయూరికి నడుమ కృష్ణానది కలదు. అది వేసగి కనుక పాటిఱేవు గలదే. బండి దానిలో నుండి సాగి పోవచ్చును. కాని గట్టుననుండి యేటిలోనికి కొన్ని నిలువుల లోతు దిగవలెను. బండి యట్లు దిగుచుండెను. బండి తోలుచున్న రైతు (మాయూరివాఁ డే ) చుట్ట కాల్చు కొనుట కంతకు ముందే బండి దిగెను. గట్టున నుండి పల్లమునాకు బండి గాడిలోనుండి వడిగా దిగజాఱునాసమయ