పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౧౧

వివాహము

ఇర్వదిరెండవయేట నాకు పెండ్లి జరిగినది. మాయూరి కాఱుమైళ్ళ దూరమున నున్న గంటసాల నా యత్తవారి యూరు. ఆ యూరే నా మేనమామగారి యూరును. తొంబది యేండ్లకు పైబడిన వయస్సువారు, మా మేనమామగారు శ్రీ పిసిపాటి వేంకటాద్రిగా రిప్పటికి నారోగ్యముతో నున్నారు. వారికి నేడ్గురుపుత్రులే కలిగిరి కాని పుత్రికాసంతానము లేదయ్యేను. మాతోడి సంబంధము తర్వాత లేకపోవు నన్న కొఱఁతతో వారి జ్ఞాతులగు మా మామగారిని నాకు పిల్ల నిమ్మని వారు కోరిరి. వారికుమారుఁ. డప్పటికి రెండేండ్లకుముందు స్వర్గస్థుఁ డయిన వాఁ డు, శ్రీసోమనాధశాస్త్రులుగారి కడను, శ్రీ వెంకటశాస్త్రిగారి కడను నాతో సహాధ్యాయుఁ డుగా నున్నవాఁ డు, వెంకటరామశాస్త్రి జీవించుచుండుటచేతను, మా మేనమామగారి కోరిక చేతను, భూవసతి లేదన్న కొఱఁతను దలఁ చి సందేహించుచున్నను మా సంబంధమున కెట్ట కేలకు మామామగా రంగీకరించిరి. వారు ప్రశాంత చిత్తులు. సద్వర్తనులు. అమాయకులు. మా తండ్రిగారి లెనే కడిపెడు బిడ్డలు గలవారు.

వివాహ మయినది. మా మాతృశ్రీ గారి మీఁది భక్తిచేతను, వారి పుట్టినయూ రని, వారి యింటి పేరి వారని నేనెంతో తనివితో నీ సంబంధమును ప్రేమించి