పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నము దొరకుట? వంట వానిని గుదుర్చుకొని వాణివంటతో భోజనము జరపుకోనుటలోని యిక్కట్టులను గుర్తించుచునే యుంటిమి గదా? మికు ఆరోగ్యకరములు, ప్రియములు నయినకూరగాయలను నేను దెప్పించి మీకు ప్రియ మయిన తీరున వంట చేయించు చుండుటచేతఁ గాదా మి యారోగ్యము ససిగా నుండుట, ప్రియముగా భోజనము సాగుత. ఇంటికి వచ్చిన మీకు కోర్టులోని పరిశ్రమపుఁ బరిహారము మావినోదముతో జరుగుట యగుచున్నది గదా! ఇంతేల? ఈ యెండ యుమ్మదములో చెమటలు దిగజారు చుండఁ గా నే నుండి విసనకఱతో విసరుచుండుట చేఁ గాదా శ్రమ మెఱుఁగకుండ మీరు హాయిగా నారగింపఁగల్గుట? నేఁ టియీ వంటకములు వంటాతఁ డే చేసినను నేను దగ్గర నుండి మీకు ప్రియమయిన కూరలు తెప్పించి తఱిగి యిచ్చి మికు నచ్చినవిధానమున మి కెంత కావలెనో అంతగా ఉప్పుకారములు వేయిచి వండించుట చేతఁ గాదా యవి యాస్వాద్యములుగా మీకుండుట!

మన శాస్త్రులుగా రిక్కడ నున్నప్పుడు గొంత కొంత సంస్కృతాంధ్యముల పరిచితి హెచ్చి తఱచుగా భారతాదులు చదువుచుండుటచే నందలి పద్యము లివి నా నోటికి వచ్చియున్నవి చిత్తగించండి!