పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖండాంతరములకు వెళ్ళి వచ్చుచు నెలలు, వత్సరములు దేశాంతరాములం దుండుతయు, తన యార్జన మెల్ల నామె యాత్రావ్యయములకై పంపవలసిన వచ్చుచుండుటయు, తన బంగళాలో గోడలు బూజుపట్టి చిత్రరచన లెన్నో సంస్కారము లేక తార్మారై చేడుచుండుటయు, దనకు గార్హస్ధ్యసౌఖ్యము దుర్లభముగా నుండుటయునొక మిత్రునితో జెప్పి వాపోవఁగా నా మిత్రుడు మితో చెప్పుట నీ నడుమ మీరు వినియుంటిరి గదా! ఏ యెండ కా గొడు గన్నట్టుండ వలెనే కాని తనకు మించిన విద్యావతిని బెండ్లాడుటలో చిక్కులే కాని సేమ ముండుట యసాధారణము.

చూడండి! ఆరంభముననే తనకు దగినపచును బెండ్లాడి రోడ్డు రిపేరు చేయుచున్న యుప్పరివాడు పగలెల్ల మట్టిపని చేయుచున్నాడు. సంజకడ ఉడుకు నీరు కాచి, యిల్లాలు వీఁ పు దోమి స్నానము చేయించగా భర్త సుఖస్నాతుఁ డై భార్యతో గంజి యన్నము, ఉప్పు, పచ్చిమిరప కాయ నంజుకొనుచు కడుపార నారగించి, తమకు గలిగిన చిన్న బిడ్డ నక్కడి చెట్టుకొమ్మకు వ్రేల గట్టిన చీరయుయ్యేలలో నూగించి, చల్ల గాలిలో నా బిడ్డ సుఖనిద్ర పడయగాఁ జెట్టు క్రింద సుఖశ యితు లగుట చూచుచుంటిమి గదా! వారి దాంపత్యమున హృద్యత గోచరించుట లేదా?

ఏకైక వ్యక్తిగా మిరుమిగిలిన మికుటుంబమున నన్నుఁ బెండ్లాడుటచే వంశవృద్ది గలిగి మీరు సుఖించుచుండుట గుర్తునకు వచ్చట లేదా? నే నుండుటచే గదా మికిట్టి సుఖభోజ