పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను నా యిర్వది యెనిమిదవ వత్సరమున భృక్త రహిత తారక రాజయోగమునఁ జేరి యబ్బురపు టనుభూతులను బడయుచుండఁ గా వారు సజీవులుగా తపోమయులుగా విరాజిల్లు చునే యుండిరి. తఱచుగా నేను స్వగ్రామమునకు వెళ్ళినపుడు చల్లపల్లి వెళ్ళియూ, వారు వారి యల్లుఁ గూతుళ్లు వర్ధిల్లుచున్న మా స్వగ్రామ మగు పెదకళ్ళేపల్లికి విచ్చేసినపుడు సందర్శించియు నా విషయముల వారికి నెఱింగించుచునే యుంటిని. వా రేంతో కుతూహలముతోఁ దాము గూడ నాతో నొకతూరి కుంభకోణము వచ్చి శ్రీ వారిని దర్శించి సంభాషించి యేమేమో పడయవలయు నని యుత్సాహ పడుచు వచ్చిరి. వారి కీయోగసంపర్కము కలుగఁ జేయవలె నని కోరిక నాకును నుండెడిది. కాని యదియు జరగలేదు.

వారు భౌతికశరీరము విడిచినపిదప నాముప్పది యెనిమిదవ నొకనాఁ డు నాధ్యాన సమయమున శ్రీ వారును, మా నాయనగారును, మామామగారును, నాతో పాటుధ్యానానుభూతిలో నుండుట కొన్ని నిమిషములపాటు గోచరించెను. ఈ మువ్వురకు నిట్టి యనుభూతి కలుగుఁ గా కానీ బహువారములు నా ప్రార్ధనమునఁ గోరుకొనుచుండెడివాఁ డను. కాన యా యనుభూతి నాకు ముదము గొల్పినది.

--- ---