పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంకటశాస్త్రిగారికడ విద్యావ్యాసంగము

శ్రీ సోమనాధ శాస్త్రులు గారిని వీడుట సమ్మతము గాకున్నము శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు క్రొత్తగా బందరు హైస్కూలులో నంద్రోపాద్యాయులుగా విచ్చేసి యుండుట చేతనే, శ్రీ సోమనాధశాస్త్రుగారి దగ్గఱ సహధ్యాయులగా చదువుచున్నవారము ముగ్గురము అవ్వారిసుబ్రహ్మాణ్య శాస్త్రి, పిసిపాటి వెంకటరామశాస్త్రి, నేను బందరులో శ్రీ వారి సన్నిధిని జదువుకొన నుత్సాహపడితిమి. తొలియిద్దఱు ముందు బందరు చేరి సందర్భములు చూచుకొని నన్ను రమ్మందుమని వెడలిరి. వారి ప్రోత్సాహమున కొలది నాళ్ళకు నేనును బందరు చేరితిని. అప్పటికి నా వయస్సు పదునాఱేండ్లయి యుండును.

తెలుఁగున నా కేమేని యెఱుక యేర్పడెనన్నచో నది శ్రీ వెంకటశాస్త్రిగారి గురుతాను గ్రహప్రాప్తమే. వారి దగ్గఱ పుస్తకము పట్టి చదివినదానికంటె వారి ముఖతఃవినోదగోష్టిలో విని నేర్చినది చాలా. ఆధ్రాత్మిక విషయమున బందరు వాసమునఁ గాని శ్రీ శాస్త్రిగారి సన్నిధిని గాని నాకు కలిగిన యుద్బోధ మేమియు లే దనియే యనవలెను. అంతే కాదు. శ్రీ శాస్త్రిగారి సన్నిధిని అవధానాధారణలు,