పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నపుడు, శ్రీ శాస్త్రిగారికి టెలిగ్రాము పంపుటయు, ఆ తంతి చేరి చేరక మున్నె ఇచట సౌఖ్యము గలుగుటయు గలదు.

  శ్రీ శాస్త్రిగారు వ్యక్తులకును, రుగ్మతలకును ట్రీట్మెంటు చేయుటయే గాక దేశము మొత్తమును పీడించుసమస్యల సుఖపరిష్కారమునక్తె గాఢామ్తెన తపస్సు చేయుటయుగలదు. 1946 ప్రాంతమందలి రాయలసీమ కరువునుగూర్చియూ, 1947 భారతదేశ స్వాతంత్ర్యమును గూర్చియూ వారు చేసిన  అమోఘ తపస్సును, అందువారు పొందిన దివ్యానుభూతులును మరువ రానివి, ఈసందర్భమున గాంధిజీ ఉపవాసములలో శ్రీ శాస్త్రి గారు వారి క్షేమమునక్తె యెంతగానో కృషి చేసెడివారని వెల్లడించక యూరకుండఁజాలను. శ్రీశాస్త్రిగారు తమ  సహజ వినయశీలమువలన నిట్టివి బహిరంగపఱచెడివారు అయన ఆహింసాత తత్వమును, హరిజనసంస్కరణ, దేవాలయప్రవేశ ఉద్యమములను బలపరచెడువారు. ఆ యధ్బుత విశేషము లెల్ల ప్రకటించవలసినదే! గ్రంధవి స్తరభీతిచే వాని నన్నింటిని వదలితిని వారి పరిచయు లెల్లరు వాని నెఱుగుదురు
    శ్రీ శాస్త్రిగారివలెనె పలువురు భృక్తరహిత తారక  రాజయోగమున దీక్ష బడసిరి వారెవరు గాని  ఇంతటి పట్టు దలతో, విజయవంతముగా నిత్యము ట్రీట్మెంటు పద్ధతిని గూర్చి వేఱు అభిప్రాయములు గూడ గలవు. ఒకటి ........... ట్రీట్మెంటు