పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారు వదలని వానిని నడచియే ఇంటికి పోమ్మనిరి. మే మందర మాశ్చర్యముతో చూచుచుండగా వాడు నడచి యింటికి చేరెను.

ఈరీతిగా వ్రాయ మొదలిడినచో ఆ నలువది నాళ్లలోని ముచ్చటలే ఒక గ్రంధమగును. తరువాత నాల్గు సంవత్సర ములకు నేను తిరుపతిలో శ్రీ శాస్త్రిగారి పునర్ధర్సనము చేసినపు డచటి సంరంభ మింతిటికంటె మిక్కిలి హెచ్చుగా నుండెను. తిరుపతిలో ట్రీట్మేంట్ల పద్ధతి కొనసాగినతీరు చూడఁగా మానవకోటికి అమృతత్వసిద్ధి యబ్బనున్నది గాబోలు ననిపించెడిది. తిరుపతిలో నున్నపుడు జబ్బులను 'పో' యన్న పోవునట్లు తోచెడిది. కాని మదరాసులో చూడనిదుర్ఘటనలు కూడ తిరుపతిలో జరుగక పోలేదు. డాక్టరు లాస వదులుకొన్న చివరి ఘట్టములో కొంద ఱచ్చటికి చేరిన వారు కలరు. అట్టి వారిని మాత్రము మృత్యువున కేల వదలవలెనని శ్రీ శాస్త్రిగారు సాహసించి ట్రీటు చేసెడి వారు. వారిలో కొందఱు సురక్షితులై నేఁ టికిని సుఖజీవనము నెఱపుచున్న వారు కలరు. కాని కొన్నింట ట్రీట్మేంటు వలన నుపయోగము కన్పించుచు నే ఆయువు తిరెడిది. నూటికి నూరుగురను సాధ్యాసాధ్యాదశలయం దన్నింటను రక్షించుటే జరిగినచో నిక సాధన పూర్తి యయినట్లే కదా! అట్టి శుభముహుర్త మిప్పటికి రాలేదు. ఎప్పటికి వచ్చునో!

ఆధ్యాత్మిక శక్తి వలన శారిరకరుగ్మతలు మాన్పనగు నని పలువురు విశ్వసింపరు. నమ్మకుండుటయే న్యాయ్యము.