పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సేతులు ముడుచుకొని పోయి స్వాధీనమున లేవు. వానిని చేతులపై మోసికొని వచ్చిరి. ఆ బాలుఁడు ముద్దగట్టిన బాధవలె నుండును. వానిని చూచుటతోడనే దెబ్బతిన్న లేగ దూడను జూచి యడల గోమాత వలె క్షోభించిపోయిరి శ్రీ శాస్త్రిగారు. ఇటు బాలునియవస్ద, అటు శాస్త్రిగారి యవస్ద చూడలేక పోయితిమి. ఆబాలునికి లోని కాహారమేమియు ఇవ్వలేదని తెలిసికొని వాని తల్లిదండ్రుల పైనను, వారి దరిద్రము పైనను కటకపడి ఇంటిలో నుండి ఒకకప్పు కాఫీ తెప్పించి స్వయముగా చిన్ని చెమ్చాతో వానినోటఁ బోసిరి. ఆ పిమ్మట వాని యారోగ్యమునకై ధ్యానము చేసిరి. ఈసరికి ఆ బాలుఁడు ప్రక్క యానుడుతో ఒక విధముగ కూర్చుండ గలిగెను. అంతట శ్రీ శాస్త్రిగారు వాని శరీరమంతయు నిమిరి సర్దిరి. వాడు సరిగా కూర్చుండ గలిగెను. చుట్టునున్న వారి మొగములు వికసించెను. ఇక వానిని నిలుచుండఁ జేసి నడిపింప వలెను. వానిని లెమ్మని చెప్పిరి. కాని వాఁడు తడుపు కొనునే గాని లేవలేఁడు. డ్రిల్లు చేయువారి నాజ్ఞాపించు సార్జంటు వలె నధికార గర్జనతో లెమ్మని తిరుగ ఆజ్ఞాపించిరి. అంతట వాఁడు లేచెను. అప్పుడు శ్రీ శాస్త్రి గారి తీరు చూచి తీరవలెను! ఒకప్రక్క యానందము! మరొకప్రక్క యాందోళనము! వాడు నడచి ననే గాని వారికి తృప్తి లేదు. వాకిలివఱకు రెండుమార్లు వాడు నెమ్మదిగా నడచెను. తరువాత వాని నింటికి గొంపొమ్మనిరి. వెనుక టివలెనే తండ్రి వాని నెత్తుకొనఁబోయెను. శ్రీ శాస్త్రి