పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుప వేఁడెద నని చివరిదాఁక ప్రశ్నము సాగును గాని నాలుక దాఁటి బైటికి రాదయ్యెను. ప్రశ్నింప వలె నని చాల తంటాల పడితిని గాని ప్రశ్నింప నా చేతఁ గాలేదు.' జీర్ణ మంగే సుభాషితమ్' అన్నట్టుగా నీ ప్రశ్నార్ధము నా లోనే నిలిచి పోయినది గాని పయికి రానే లేదు. నేనీ యోగ మార్గమున చేరిన పదియేండ్లకు అనఁగా 1926- వ సంవత్సరమున నా యను భవమున నొక యద్భుతానంద మయ విషయము జరగెను. దాని నెఱుగుదునంతేకాన1936 దాఁక అనఁగా మఱి పదియేండ్లదాఁకఁ గాని దాని వివరణ మెల్ల తెలియరాదయ్యెను. దానినాయాసందర్భము లందు వివరింతును.

ఈ నాడీగ్రంధము లాయా జాతకుల హృదయములలో దాగియుండిన రహస్యార్దముల గూడఁ గొన్ని కొన్ని పట్టులం దద్భుతముగా వివరించుట కలదు. అవి నాడీరచయితకును, జాతకు నకునే తెలియ వలెను గాని గ్రంధ పాఠకుఁ డగు నాడీస్వామికిఁ గూడ తెలియవు. ధ్రువనాడిలో నిట్టి వానిని గొన్నింటిని బేర్కొందును.

   'జలగండ మవాప్నోతి మృతప్రాయోపజీవనః' అని నా జాతకమునఁ గలదు. నేను మఱచితిని గాని యది జరగిన విషయమే! మా దొడ్డిలో పిల్లలము కొందఱ మాడుకొనుచుంటిమి.  నూతిలో వెదురుగడలు దింపి వానిని బట్టుకొని పైకి లాగుచుంటిము. నేను వేసినగడ నీటిలో అడుగున బురదలో లోనికిఁ జొచ్చుకొన్నది. దాని పై యంచు ఒరమిఁద