పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నున్న నా కందకుండెను. లోనికి తలవాంచి యెట్లే నందుకొన జూచుచుంటిని. ప్రక్క పిల్లవాఁడు నా ముడ్డి పైకెత్తెను. నేను నూతిలోఁ బడిపోయితిని. పిల్ల లందఱు పటాపంచలై పాఱిపోయిరి. మా నాయనగా రూర లేరు. మా యమ్మగారు నింటిలో నేదో పని చేసికొనుచుండిరి. నూతిలో పెద్దధ్వని గలుగుట ప్రక్కయింటి యాతఁ డాలకించి దొడ్డిలోనికి వచ్చి చూడఁ గా పిల్ల లందఱు పాఱిపోవుచుండిరి. ఒక పిల్ల వానిఁ బట్టుకొని గట్టిగా నడుగఁ గా నేను నూతిలోఁ బడుట చెప్పెను. ఆతఁ డు పర్వెత్తుకొని వచ్చి చూచుతఱికి నాల్గు మూఁడు నిమిషము లాయెను. నే నొక మునుక వేసి తేలి నూతిలో నూగిసలాడుచున్న గడను పట్టుకొని మరల మునుక వేయక తేలియుంటిని. ఆతఁ డొరల మిఁదుగా దిగివచ్చి నన్నుఁ బట్టుకొని మా యమ్మగారి కప్పుజెప్పెను. ఈ విషయ మా నాడిలో నున్నది.

   అట్లే పందొమ్మిదవ యేట అవనిగడ్డ దగ్గఱ బండి యేటి లోనికి దిగుచుండఁ గా బోల్తా  కొట్టి చచ్చి బ్రదికితిని." వాహనాత్పతనం చైవ తిన్మూలాచ్చ మహాద్విపత్" అని యందు కలదు. ఇట్టివి ప్రతి జాతకములోను వింత వింతలుగా నుండుట నే నెఱుఁ గుదును.
   నే నెఱిఁగిన మఱొక గొప్పవింత. మద్రాసులో నొకా నొక గొప్పయింట నొక పిల్లవాని కేదో కడుపులో తీవ్రమయిన యనారోగ్యము. అది కుదుర్పరానిది. బ్రదికిన నొక వేళ శస్త్రచికిత్సతో బ్రదుక వచ్చు నని యాస. ఆ కుఱ్ఱ