పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రచించినవిగా నున్నవి. ధ్రువనాడీ సత్యసంహితలు సత్యాచార్యు రచన లనఁ గా నేనే మనుకొంటి ననఁగా సత్యాచార్యుని యంశమున నిటీవల జనించినవా రెవరో పూర్వానుస్మృతి కలిగి వానిని రచించి యుందు రని.

   ఇక్కడ వక్తవ్యము చాలఁ గలదు. ఈతఁడు శివాంశమున జనించినాఁ డనీ (అప్పయ దీక్షితాదులు), ఈతఁడు గుడిగంట యంశమున జన్మించి (వేదాంత దేశికులు ) నాఁడనీ  యిత్యాది విధములఁ బలువురను ప్రాచీన మహనీయులను గూర్చి ప్రామాణికులే నిర్ణయించి పలుకు  చుండుట కలదు. ఆయా దేవతల ఖండావతారములుగా వారిని నిర్ణయించుట సంగతము. ఆయా మహామహులు లోకమున నేవేవో యపూర్వాద్భు తార్ధములను వెలయించుటకై యవతరించుట కలదు. దేశ కాలాదుల యసౌకర్యముబట్టి యాయా కార్యములను వా రప్పుడప్పుడే యాయా యవతారములలోనే నిర్వర్తింప వీలుకడక పోవచ్చును. శుద్ధసంకల్పులు గనుక వారు వా రాయా కార్యములను గొన్ని జన్మముల నెత్తి నిర్విర్తింప వలసిన వారగుచుందురు. శంకర, జిన, బుద్దాదుల కార్యములట్లే యొక జన్మమున నిర్వాహము చెంద వయ్యెను.
   అతి ప్రాచీనులయి జ్యోతిషమున నద్భుత గ్రంధములు రచించిన సత్యాచార్యాదులు  మరల మరల జన్మించుచు లోక వృత్తమును గొన్ని కొన్ని షష్టులకు రచించుచు వచ్చుచుండి రని నా విశ్వాసము. తర్వాతి తర్వాతి జన్మముల