పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కట్టుపనిలో నేను మద్రాసులో నుండి ఆరోగ్య విషయమున గ్రంధపరిశీలన విషయమున, యోగసాధన విషయమునఁ జాల నభ్యు దయము చెందితిని. ప్రతి దినము నేను మిత్రులతోఁ గలసి యోగా భ్యాసము చేయుచుంటిని.

   ఆ నాళ్ళలో ధ్రువనాడీ పరిశోధన మధికముగా జరగెను. అందు శ్రీవారి జాతకము పరిశీలించుట జరగెను. ఇంక  ననేక  మిత్రుల  జాతకము పరిశీలనము జరగెను. ఆ యుత్సాహమున నా జాతకమును బరిశీలింపించుకొంటిని. ద్రువనాడీ సత్యాచార్య ప్రణీత మని యం దున్నది. సత్యా చార్యుఁ డు పంచ సిద్ధాంతి కాది గ్రంధకర్త యనియు, క్రీ. 4- వ శతాబ్ది వాఁడనియు యిందలి భాషా శైలీ లక్షణాదులను జూడఁగా నది సత్య మనిపించదు.
   ఈ నాడీగ్రంధములు సంస్కృత ద్రవిడ భాషలలో నరవ దేశముననే యధికముగాఁ గలవు. ఆంధ్రదేశమునఁ గూడ నాంధ్ర భాషలో వేముల వాడ భీమన రచితముగా నొక నాడీ గ్రంధ మున్నది. కాని యది సీసమాలికగా వేములవాడ భీమకవి రచన మని విశ్వసింపఁ దగనిదిగానే యున్నది. దానిని ప్రాచ్య లిఖిత పుస్తకశాలకు నేనే సేకరించితిని. అది ప్రస్తుత కాలమున నుపయోగపడునది కాదు. ఇక సంస్కృత ద్రవిడ గ్రంధములలో ధ్రువ నాడీ యని, సత్యసంహిత యని, శుక్ర నాడీయని నాల్గు గ్రంధముల నే నెఱుఁగుదును. అవి యెవరో ప్రాచీన మహర్షులు, తత్కల్పులు