పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేవో శ్లోకములుదాహరించుచు సమర్ధించుకొనుచుండుట యజ్ఞానపుఁ బిరికి తన మనవలదా? గర్భవతుల గ్రహణములఁ జూడరాద నుట, ఆదివారము నాఁ డుసిరిక పచ్చడి తినరాదనుట, రాత్రులందు లవణము పేరు- ఉప్పు- అన్న తెలుఁ గు పేరే- పేర్కొన రాదనుట (లవణము - బుట్టలోనిది- చెప్పరానిది ఇత్యాది విధములఁ దెలుప వచ్చును.) మొదలయిన విట్టివే.

మన తలఁపులలో, పలుకులలో, పనులలో మంచి చెడుగులు పెన వేసికొని సాగుచున్నవి. చెడుగు లేని యచ్చ మంచితనము మానవత కింకను నంద లేదు. జన్మము లెత్తఁగా నెత్తఁగా సత్త్వము హెచ్చికిళ్ళను దొలఁగించుకొని మెళ్ళను పడగా బంగారుకు వన్నె హెచ్చినట్టు మానవునిలో హెచ్చఁ జొచ్చెను. సద్భావ ప్రాబల్యము కలిగినప్పుడు ప్రపంచము నాలుగుంచుల ప్రజాసంఘము నెల్ల పాఱజూడఁ గల్గినప్పుడు దేశజాతి కులశ్రయము లయిన నిరర్ధకాచారములు తొలఁ గి పోగలవు.

స్వీయు లందఱు నానాఁడు నా వివాహమును గూర్చి వివాహిత యగుకన్యను గూర్చి యతృప్తి చెందిరి గాని, కొంత నాకు గూడ వెఱపు గల్గుస్థితివలె వేర్పడెను గాని కాలము కొంత గడచిన తరువాత నందఱనిశ్చయములును దల్ల క్రిందు లై పోయినవి. అవి ముందు ముందు తెలియఁ గలవు. అట్టి శుభ పరివ ర్తనము కలుగుటకు వివాహ మయిన తర్వాత సంవత్సరము లెనిమిది గడవవలసెను.