పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయినను నెదురుగా వచ్చినచో వ్యంగ్యముగా మొగము చిట్లించుకొని గర్హించుటో, వాచ్యముగానే తెగడుటో జరగు చుండును. తన యింటిలోని వారే అయినను, పరాయి వారె అయినను వితంతువు వచ్చినచో గర్హించుటయు, ప్రయాణము నిలుపుటయు జరుగుచుండును. మఱీవింత- ప్రయాణమయిన వ్యక్తి వితంతువే అయినను గూడ తనకు వితంతు వెదురుగా వచ్చిన గర్హించును. ఈ శకునపరిక్షల వల్ల ప్రయాణముల నాపుకొనువారును, నని వార్యముగా పయన మయినను నిరుత్సాహనిహతిచే ససిగా సాగించుకొనలేక ఎదురు వచ్చిన వారిని గర్హించుటచే వారితోను, వారి కుటుంబముతోను దీర్ఘ వైరము తెచ్చుకొనువారును నెందఱో ఉన్నారు. రైలు ప్రయాణములకు శకున ముహూర్త పరిగణ నము చేయుచు అనుకూల శకునముహూర్తాదులకై కొంతసే పాగి పోవుటో చాల ముందుగానే పయన మగుటో చేయువారున్నారు.

మన మంచిచెడ్డలకు మనమే ప్రవర్తకుల మనీ, మన సత్కార్యసత్సంకల్ప బలముచే మన మంచిని మనమే సాధించు కొనఁ గల్గుదుము గా కనీ లోఁతయిన పట్టుదలతో వర్తించు వా రిట్టి చిలిపి చీ కాకులకు పాల్పడరు. మంచి శకునములకేన్నింటి కోదుష్పలితములు గలుగుచుండుట, దుస్స కునముల కేన్నింటికో సత్ఫలితములు గల్గుట గుర్తించుచున్నను గూడ శాస్త్రము ప్రమాణ మని ప్రామాణ్య నిశ్చయము లేకున్నను దానినే విశ్వసించుచుండవలె నని