పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారు నిరపాయులుగా నున్నందుకు తనిసి ' సోమి దేవమ్మగా (వారి యత్తగారు) రేమైరండీ' అంటిని.' బ్రతికున్నవా నాయనా' అనుచు నామె పర్వెత్తి వచ్చెను.' మా కిద్దఱికీ మొండి ఘటాలకి ఏమి దెబ్బ తగుల లేదు. నాయనా! నీ చెయ్యియి దేమిటి?' అని ఆమె యేడ్వసాగెను.అప్పుడు నేను నా చేతులను జూచుకొంటిని. కానీ అందాఁక నేను బాధ నెఱుఁగను. నా దక్షిణ బాహుమూలము నా కడుపు మిఁ ద వ్రేలాడుచుండెను. ఆ వికృతి చూడఁ గా నాకు వాంతి, మైకము, కంపము కలుగఁ జొచ్చెను. ఇంకేమేమి యంగ వికృతి కలిగెనో, ముం దేమగునో అన్న కంగారుతో అవధానులు గారి నిట్లు ప్రార్దించితిని.' నా పూర్వకర్మానుభవమేదో నేన నుభవించుచున్నాను. నాస్థితి యేమగునో! మా తల్లిదండ్రులకు నెమ్మదిగా నా స్థితి తెలుపండి. ఈ ప్రాణమున్నా, పోయినా వీనిని నన్నుగా భావించి కాపాడండి! కానీ నిందాదులు చేయకండి. దప్పి, దప్పి' యనుచు మైమఱుపాటు చెందితిని.

కొంత సేపటికి చల్లని మంచినీరు, మజ్జిగ దగ్గఱి క్రొత్తపేట బ్రాహ్మలు తెచ్చి యీయఁ గా, చన్నీటి గుడ్డతో మొగము తుడిచి, ప్రజ్ఞ రప్పించి యిచ్చిరి. మాయూరి కారణముగారు, మానాయనగారి బాల్యమిత్రము శ్రీ కొడాలి వెంకయ్యగా రింతలో నక్కడికి బండి మిఁద నెక్కించి నన్ను వెనుకకు అవనిగడ్డ కే- ఆస్పత్రి కలదు గాన, మా యన్నగారు కలరు గాన- త్రిప్పి