పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంపి నాకొక మిత్రుని తోడిచ్చి, బోల్తాకొట్టిన బండిని లేవనెత్తి, దాని మీద నా బండిలోని వారిని గూడ జేర్చుకొని కళ్ళేపల్లికి వెళ్ళిరి. బండి నెమ్మదిగా నడచినను జాఱిపోయి వ్రేలాడుచేతితో వికార గ్రస్తుఁ డ నయి యున్నన న్నవనిగడ్డ చేర్చిరి.

నాటిఁరాత్రి - ఆస్పత్రి అసిస్టెంటు ఊర లేఁ డు గాన కంఫౌండరే ఒక సాహెబు నా చేతిని సరిదిద్దఁ జొచ్చెను. క్లోరోఫారం ఇయ్య లేదు. చంకక్రింద గుడ్డ మడత బెట్టి దిండుగానుంచి ఇంకొక తుండుగుడ్డ చంకక్రింద దూర్చి యొకరు తల దగ్గఱ నుండి లాగుట, ఇంకొక నా చేతిని కాళ్ళ దిగువనుండి లాగుట సాగించిరి. జబ్బు మజుల్సు చిఱుగుచున్నట్లయ్యెను.గగ్గోలు పెట్టితిని . అయినను విడువక లాగిరి.డమ్మని మ్రోఁత మ్రోగెను. చేయి స్వస్థానము చేరే నని చెప్పి కంఫౌండరు కట్టుకట్టెను. మార్నాడు ఆస్పత్రి అసిస్టెంటు వచ్చెను. నాకు చేయి రుబ్బురోలువలె వాచెను. తీవ్రజ్వరము వచ్చెను. నాల్గయిదు రోజు లుంటిని. వాపు తీసినదిగాని చేయి లేవదు. ఆస్పత్రి అసిస్టెంటు ఉద్యోగమునకు, జీవితమునకుఁ గూడ తుది దశలోనున్నవాఁడు (కొలది రోజులకే రిటైరగుట,స్వర్గస్థుడగుట జరగెను. అతిమూత్ర వ్యాధిగ్రస్తుడు) నన్ను బాధించుట తప్ప సరిదిద్ద లేక పోయెను.

ఇంటికి వచ్చి, అక్కడ నుండి బందరు వచ్చి శ్రీవల్లూరి సూర్యనారాయణరావుగారిని తోడఁ బిలుచుకొని ఆస్పత్రికి వెళ్ళితిని. సుబ్బయ్యర్ అను సర్జన్ ఉండెను, సూర్య