పుట:Prabodhanandam Natikalu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముస్లీమ్‌  :- సరే అడగండి, నా పేరే వహీద్‌, నేనెందుకు చెప్పలేను?

దొంగ  :- వహీద్‌ నీ శరీరము పేరని జ్ఞప్తికుంచుకో. ప్రళయములో దేవుడు మనిషిని తిరిగి లేపుతాడన్నారు కదా! ప్రళయము అంటే ఏది?

వహీద్‌  :- ప్రపంచమంతా నాశనమై పోవడమే ప్రళయము.

దొంగ :- ‘ప్ర’ అంటే పుట్టినది ‘పంచము’ అనగా ఐదు అని అర్థము. ప్రపంచము అనగా పుట్టివున్న ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అని అర్థము. ప్రళయము అనగా పుట్టినవి లయించి పోవడము, లేక నాశనమై పోవడమని అర్థము. బయట కనిపించే ప్రపంచము యొక్క ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములు. కనిపించే ప్రపంచము 108 కోట్ల సంవత్సరము లకు ప్రళయము చెందుట నిజమే. కానీ ప్రళయము అనునది మరొకటి కూడ కలదు. పంచ భూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి వలన ఏర్పడిన నీ శరీరము కూడ ఒక ప్రపంచమే. నీ శరీరము ఐదు భూతముల వలననే పుట్టినది. నీ శరీరము ఎప్పుడు చనిపోతుందో ఆ దినమును కూడ ప్రళయమే అనవచ్చును. పంచభూతముల వలన పుట్టిన ప్రపంచములు చర, అచర అను రెండు కలవని, అలాగే ప్రళయములు కూడ చర ప్రళయము, అచర ప్రళయము రెండు కలవని దీనివలన తెలియుచున్నది. రెండు ప్రళయములను దేవుడే సృష్ఠించాడు. ప్రవక్త చెప్పింది చలించు చరా ప్రపంచమైన మనిషికిగానీ, అచర ప్రకృతియైన బయట ప్రపంచమునకు కాదు. ప్రవక్త మనిషికి సంబంధించిన విషయములను చెప్పగ, చెప్పిన విషయమును తనకు వర్తింపజేసుకొని చూడకుండ, సంబంధములేని బయటి ప్రపంచమునకు వర్తింపజేయుటను బట్టి ప్రవక్త మాటను మనిషి అర్థము చేసుకోలేదని తెలియుచున్నది. ప్రవక్త చెప్పినవన్ని మనిషికి దగ్గరగానున్న సూత్రములనే