పుట:Prabodhanandam Natikalu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(అక్కడ ఒక విధమైన శబ్దము ఏర్పడగా అందరూ ఆశ్చరముగ చూస్తుండగా అక్కడికి వాయువు, అగ్ని ఇద్దరూ ప్రవేశిస్తారు.)

అగ్ని :- ఏమి భూమీ! నీవేదో మాపేర్లు చెప్పుచున్నావు.

భూమి :- అవును. నేను కూడ మీతోపాటు పురుషుణ్ణే కదా! వీరు నన్ను భూమాత అనీ, భూదేవి అని పిలుస్తున్నారు. అదే విషయమును గురించి వాయువును వాయుదేవుడనీ, అగ్నిని అగ్ని దేవుడని చెప్పే వీరు నన్ను మాత్రము ఆడదిగా చెప్పడమెందుకని ప్రశ్నించుచున్నాను.

అగ్ని :- భూమిమీద మేము ఎంతో జ్ఞానులమనీ, సర్వజ్ఞులమనీ చెప్పుకొనే వీరు, నిన్ను స్త్రీగానే పిలుస్తున్నారు. అంతమాత్రము తప్ప, నిన్ను ఎక్కడా వాడుకోలేదు. నన్నయితే ఏకముగా గుమస్తానే చేసినారు. వీరు యజ్ఞ గుండములో వేసే పట్టుచీరలు, నగలు మొదలుకొని ప్రతీదీ ఎవరికి సమర్పిస్తే వారికి చేర్చుటకు, ఆ వస్తువులను కాల్చి పొగరూపములోనికి మార్చి పంపాలట!

వాయువు :- నీవు పొగరూపములోనికి మార్చితే, ఆ పొగరూపములో ఉన్న వస్తువులను వీరు ఎవరి పేరు చెప్పి సమర్పించారో వారికి చేర్చాలట. వీరి లెక్కలో నేను కూడ గుమస్తానే! యజ్ఞాలు చేస్తే లాభాలు కలుగుతాయని భ్రమించి, మమ్ములను మీ పని మనుషులుగా ప్రచారము చేస్తారా? తెలియని ప్రజలు మేము అలాంటి పనులు చేసేవారమే అనుకోరా? ప్రకృతిలో భాగములైన మేము, దేవుని ఆజ్ఞ ప్రకారము పనిచేయుచున్నాము. కానీ మనుషుల ఆజ్ఞల ప్రకారము పనులు చేయడములేదు. మీరు చేసే యజ్ఞముల వలన, ప్రజలు మమ్ములను తప్పుగా అర్థము చేసుకొను అవకాశము గలదు. పండితులమని పేరుపెట్టుకున్న మీరు, మమ్ములను పని మనుషులుగా