పుట:Prabodhanandam Natikalu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రచారము చేయడము బావ్యమా! మీరు చేసే యజ్ఞములో అటు భూమి, ఇటు నీరుకంటే అగ్ని వాయువులైన మమ్మే ఎక్కువ వాడుకొను చున్నారు. ఇది మీకు ధర్మమా?

(అపుడు మరియొక వింతశబ్దము ఏర్పడును. అంతలో అక్కడికి నీరు కూడ వచ్చును.)

నీరు :- ఏమిటీ? ఇక్కడ భూమి, అగ్ని, వాయువు ముగ్గురూ ఉన్నారు. నాపేరును పలుకుచున్నారేమిటి?

అగ్ని :- భక్తి అను ముసుగులో వీరు చేయు అధర్మపనులను విమర్శిస్తున్నాము. మీస్వార్థము కొరకు మమ్ములను ఎందుకు దుష్ప్రచారము చేస్తున్నారని అడుగుచున్నాము.

నీరు :- వీరు పండితులమని పేరుకల్గి, భక్తి అను పేరుతో వక్రమార్గములో ప్రయాణిస్తూ, వీరు చెడిపోవడమేకాక, వీరిని అనుసరించు ప్రజానీకమంతా చెడిపోవునట్లు చేయుచున్నారు. పండు అనగా బాగా పరిపక్వత చెందినదని అర్థము. జ్ఞానములో బాగా పండినవారిని పండితులు అని అనవచ్చును. కానీ వీరివద్ద జ్ఞానము ఏమాత్రములేదు. అయినా పండితులమని ముసుగు తగిలించుకొన్నారు. భక్తీ, విశ్వాసము, విశ్వమునకంతా అధిపతియైన దేవుని మీద ఉండాలి. దేవుని మీదకాక చిల్లర దేవుళ్ళ మీద భక్తిని చూపుచు వారికొరకు యజ్ఞములనుచేయు వీరా పండితులు? వీరిలో చిల్లర దేవుళ్ళ భ్రమతప్ప అందరికి అధిపతియైన, అన్ని మతములకు పెద్దదిక్కు అయిన దేవుని మీద వీరి దృష్ఠి ఏమాత్రములేదు. మహాభూతములని పేరుగాంచిన భూమినేమో భూమాతా, భూదేవి అని స్త్రీని చేశారు. అగ్ని, వాయువులనిద్దరిని అగ్నిదేవుడు, వాయుదేవుడని మగవారిని చేశారు. చివరకు నీరునైన నన్ను అటు ఆడకాకుండ, ఇటు మగకాకుండ చేశారు. నదిలో ఉన్నప్పుడు గంగమ్మ