పుట:Prabodhanandam Natikalu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిందువులనే హింసించలేదా! ఆదిశంకరాచార్యులకంటే ఎక్కువగా హిందూ ధర్మములకు వివరముచెప్పే గురువును, విపులముగా భగవద్గీతను వ్రాసిన గురువును, హిందూమతములోనే ఎంతో పెద్దజ్ఞానులచేత ఇది నిజమైన జ్ఞానమనీ ప్రశంసింపబడిన గురువును, మీరు తయారుచేసిన హిందూ సంఘములు గుర్తించకపోవడమేకాక, మేము ఏమీ చేయుచున్నామను ఆలోచనే లేకుండ గురువుగారు వ్రాసిన భగవద్గీతను నడిరోడ్డులో మీరు తగులబెట్టారు కాదయ్యా! కాల్చినవారు. అందులో ఏముంది అని చూచారా? మనము ఎవరిని అవమానిస్తున్నామని ఆలోచించారా? అంతగ్రుడ్డిగా హిందువులు హిందువుల మీదికే దాడి చేయుచున్నారంటే ఇదంతా మీచలవకాదా! ఈ రోజు మా స్ఫూర్తితో భగవద్గీత శ్లోకాలను అనర్గళముగా చదివే ఇతర మతస్థులను చూస్తున్నాము. మీ చలువతో భగవద్గీత అంటే ఏమిటో తెలియని హిందువులను ఎందరినో చూస్తున్నాము. ఇదంతయు ఎవరి వలన జరిగినది. మీ వలననే! మీరు తయారు చేసిన హిందూసమాజములో దేవుడు అనినా, సృష్టికర్త అనినా అర్థముకాక, ఈ పదములు ఇతర మతస్థులవని మనవి కావంటున్నారు. ఆదినుండి ఉన్న సృష్ఠికర్త అను పేరును, దేవుడు అను పేరును నిన్న మొన్న పుట్టిన ఇతర మతములవారికి లీజుకిచ్చినట్లు అవి మనవికావంటున్నారు. ఇలాంటి హిందూసమాజమునకు పునాదివేసినది మీరు కాదా! తాచెడ్డకోతి వనమెల్ల చెరిచినట్లు, మీరు అజ్ఞానులై పోయి హిందూసమాజమునే అజ్ఞానమ వైపు నడిపించారు. మహోన్నతమైన జ్ఞానము కల్గినవారై పూర్వపు ఇందువులుండెడివారు. నేడు తమ ధర్మమును తామే గుర్తించలేని హిందువులు దైవభక్తిని వదలి దేశభక్తిని కల్గియుండాలంటున్నారు. చివరకు దేశభక్తి కూడ పోయి మతభక్తి ఏర్పడినది. దానివలన అజ్ఞాన హిందువులమై పోవడమేకాక, మనమే మత హింసలను ప్రోత్సహిస్తున్నాము. ఇదంతయు