పుట:Prabodhanandam Natikalu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అట్లు కూడలేవు. అన్ని శరీరములలో జీవాత్మలు గుణచక్రములోనే ఉన్నవి. కాబట్టి అవియు సమానమే! వాటికి అంటులేదు. ఇక ఆత్మ విషయానికివస్తే అది అందరిలో బ్రహ్మనాడిలోనే ఉన్నది. అదియు అంటులేదు. శరీరము, ఆత్మలు అన్నీ సమానమైనపుడు మీరేమిటిని ‘అంటు’ అనుచున్నారు. అంటు అంటే దానికి పరిష్కారము శుద్ధి అంటే నేను ఒప్పుకోను, అంటు ఏమిటో ఎక్కడుందో చెప్పి తీరవలసిందే.

బ్రాహ్మణుడు :- అంటు ఏమిటో నాకు తెలియదు. మాపెద్దలు చెప్పారు అందువలన నేను చెప్పాను.

చండాలుడు :- మీరు బ్రతుకుతెరువు కొరకు మంత్రాలు నేర్చుకొన్నారు. సంపాదనకొరకు పంచాంగములను పట్టుకొన్నారు. పెళ్ళికి అర్థము చెప్పకుండానే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇది జ్ఞానమగునా?

బ్రాహ్మణుడు :- పుట్టిన తర్వాత ఏదో ఒక పని చేయాలి కదా! మా వలననే హిందూసంస్కృతి మిగిలివున్నది కదా!

చండాలుడు :- ఊ....... మీకు హిందూసంస్కృతి అన్న పదమునకు అర్థము తెలుసునా? హిందూ సాంప్రదాయములను సర్వనాశనము చేసినది మీరు కాదా! నేడు మీ అసమర్థతవలన హిందూమతములోని ఎన్నో కులములవారు ఇతర మతములలోనికి పోయారు. ఏమీ తెలియని అమాయక యువకులను, మనము హిందువులమని హిందూధర్మములను కాపాడుకోవాలని, పరమతములను ద్వేషించాలని కొన్ని హిందూసంఘముల పేరుతో ప్రోత్సహించినది మీరు కాదా! నేడుగల హిందూ సంఘములకు మతతత్త్వమును నేర్పారుగానీ, హిందూధర్మములు ఇవియని తెలిపారా? మీకు విరుద్ధముగ మాట్లాడిన హిందువులనైన పరమతస్థులుగా చిత్రీకరించ లేదా! హిందూధర్మములులేవో తెలియని హిందూసంఘములు గ్రుడ్డిగా