పుట:Prabodhanandam Natikalu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భగవంతునికి అర్థము తెలియదు. శివునికి, శంకరునికి తేడా తెలియదు. యోగమునకు, యజ్ఞముకు బేధము తెలియదు. దేవునికి, దేవతలకు తారతమ్యము తెలియదు. జ్ఞానమును తెలియని వారందరు మేము గొప్పగ తెలిసినవారమనుకొని, ప్రజలను తప్పుదారి పట్టించడము వలన ఇలాంటి ఉద్యోగస్థులు, పోలీస్‌లు, వ్యాపారస్థులు, రాజకీయనాయకులు పాపాత్ములగు చున్నారని నా అభిప్రాయము. అందువలన భూమిమీదున్న స్వామీజీలలోను, పీఠాధిపతులలోను మార్పువచ్చునట్లు చేయమని నా విన్నపము.

యముడు :- నిజము చెప్పితివి. నీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. అందువలనే యమధర్మరాజు తీర్పులో సాధారణ మనుషులకు ఒకమారు అనుభవిస్తే అయిపోవు శిక్షయుండగా, జ్ఞానులమనుకొన్న అజ్ఞానులు దేవుని విషయములో పాపము చేయుచుండుట వలన, వారికి రెండు యుగములు అనుభవించు శిక్ష విధింపబడుచున్నది. నీవు వారిలో మార్పును అడిగావు, కావున గురువులలోను, స్వాములలోను, పీఠాధిపతులలోను, బాబాలలోను మార్పు తెచ్చుటకు ఇప్పటికే త్రైతసిద్ధాంత ఆదికర్త భూమిమీద పుట్టియున్నారు. ఆయన వలననే నీవు కోరిన మార్పు జరుగగలదు.


కింకరులారా! మీరు మహాభూతములుగా, స్వల్పభూతములుగా ఉపభూతములుగా, గ్రహములుగా విడిపోయి వీరు నలుగురు పాపమును అనుభవించునట్లు చేయండి. లంచాలతో బ్రతికిన ఈ ఉద్యోగస్థునికి మరుజన్మలో ఉద్యోగము లేకుండ కూటికి, గుడ్డకు కరువుగా బ్రతుకునట్లు చేయండి. పోలీస్‌ ఆఫీసర్‌గా గర్వముతో బ్రతికి అనేకుల మీద తప్పుడు కేసులు బనాయించిన వానిని, రేపుజన్మలో తప్పుడు కేసులోనే జైలుకుపోయి జీవితాంతము జైలులో గడుపునట్లు చేయండి. పోలీస్‌గా ఉన్నపుడు గురువును నిందించినందుకు వందజన్మలు చర్మరోగముతో బాధపడునట్లు