పుట:Prabodhanandam Natikalu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసెదను. వడ్డీ వ్యాపారముతో అనేకులను పీడించిన ఇతనిని పాముజన్మకు పంపించి, ఇతని వలన బాధపడిన వారిచేత, పాము కనిపిస్తూనే రాళ్ళతో కొట్టునట్లు చేసి, దిన దినము భయముతో బ్రతుకునట్లు చేయండి. ఇక రాజకీయనాయకునికి, ఇతను చేసిన హత్యాపాపమునకు చిన్నవయస్సులోనే శత్రువులచేత చేతులను నరుకునట్లు చేసి, జీవితాంతము మొండిచేతులతో బ్రతుకునట్లు చేయండి.


మాయకు వ్యతిరేఖమైన ధర్మమును తెలిసిన యమధర్మరాజునైన నేను చెప్పిన మాటకు తిరుగులేదు. కావున నాకు వ్యతిరేఖమైన ‘‘మాయ’’ వైపు ఉంటారో, మాయకు వ్యతిరేఖమైన ‘‘యమా’’ వైపు ఉంటారో యోచించు కోండి. ఇంతటితో ఈ సభను చాలించెదము.

-***-


ఎగువవాడు - దిగువవాడు

స్టేజిమీద ఒక బ్రాహ్మణుడు వస్తూవుంటే, అతనికి ఎదురుగా మాదిగ కులస్థుడొకడు వచ్చుచుండెను. అంతలో...

బ్రాహ్మణుడు :- ఓరే చండాలుడా! బ్రాహ్మణుణ్ణి దారిలో పోతూవుంటే నా ప్రక్కనే నీవు పోతావా? అంటరానివాడివి, మాంసము తినేవానివి, నీచునివి సత్‌బ్రాహ్మణుని ప్రక్కగా పోకూడదని నీకు తెలియదా? నువ్వు చేసిన పనికి నేను తిరిగి స్నానము చేసి శుద్ధి చేసుకోవలెను.

చండాలుడు :- ఏమి స్వామి! మీరు వస్తూంటే మీ ప్రక్కగా మేము పోకూడదా? ఇక్కడున్నది ఒకే దారికదా! దారిలో పోవునపుడు ఎవడైనా ప్రక్కగానే పోతాడు. అంతమాత్రాన ఇన్ని మాటలనుచు నన్ను అంటనివాడి వని, నీచుడవని అనవచ్చునా?