పుట:Prabodha Tarangalul.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

769. దేవుడు దేవులాడబడేవాడు (వెదకబడేవాడే) ఎప్పటికి కనిపించే వాడు కాడు. మనిషి దేవులాడేవాడు (వెదికేవాడు), ఎప్పటికీ కనుగొనలేడు.

770. ప్రపంచవిషయములలో మునగనిది, దైవజ్ఞానమును చూచి అసూయ పడనిది, మనిషికంటే బుద్ధిలో తక్కువ, జ్ఞానములో ఎక్కువగా ఉన్నది, మనిషికంటే పాపసంపాదన తక్కువ గలది (గుడ్డలులేని జంతువు).

771. దైవజ్ఞానము అంటే ఏమిటో తెలియని మనిషి, దేవుడెవరో, దేవతలెవరో తెలియని మనిషి, దైవజ్ఞానమును చూచి అసూయపడు మనిషి, ప్రపంచ విషయములలో మునిగిపోయి తన చావును మరచిన మనిషి (గుడ్డలున్న జంతువు).

772. ఇందూమతములోని "మాయ", ఇస్లాంమతములోని "సైతాన్‌", క్రైస్తవమతములోని "సాతాన్‌" అన్నీ ఒక్కటే. దైవమార్గమునకు ఆటంకమును చేయునదే మాయ.

773. అరచేతిలో అతిపెద్ద రహస్యం కలదు. కనుకనే గుడిలోని ప్రతిమ తన హస్తమును చూపుచుండును. అది అభయహస్తము కాదు. అతి రహస్యమైన మూడు ఆత్మల త్రైతము.

774. సిరి అనగా సంపద, మగసిరి అనగ జ్ఞానసంపద. పురుషుడు అనగా పరమాత్మయనీ, మగవాడైన పరమాత్మజ్ఞానము కలవానిని మగసిరి కలవాడని అందురు.

775. స్త్రీలను రమింపజేయడము మగసిరికాదు. ప్రకృతి జ్ఞానమును అతిక్రమించు జ్ఞానమును కల్గియుండడమే నిజమైన మగసిరి కల్గియున్నట్లు తెలియుము.