పుట:Prabodha Tarangalul.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

763. యజ్ఞముల విూద, వేదపఠనముల విూద, దానముల విూద, తపస్సుల విూద దేవునికి అయిష్టత కలదు. బ్రహ్మయోగమూ, కర్మయోగమూ, భక్తి యోగముల మూడిటి విూద దేవునికి పూర్తి ఇష్టము కలదు.

764. దేవునికి ఇష్టములేని యజ్ఞములను, దానములను, వేదాధ్యయనములను, తపస్సులను నాల్గింటిని వదలి దేవునికి ప్రీతిని కల్గించు బ్రహ్మయోగము, కర్మయోగము, భక్తియోగములను మూడిటిని ఆచరించుటకు ప్రయత్నిద్దాము.

765. నేటి కాలములో స్వాములూ, పీఠాధిపతులూ, బాబాలూ మొదలగు వారందరు యజ్ఞాలు చేస్తున్నారు, వేదములను పఠిస్తున్నారు. ధనికులందరు దానములు చేస్తున్నారు. మెడిటేషన్‌ అను పేరుపెట్టి తపస్సులు చేయుచున్నారు. ఈ విధముగ చేయడమేనా భక్తి?

766. దేవుడు భగవద్గీతయందు విశ్వరూప సందర్శనయోగమను అధ్యాయములో 48,53 శ్లోకములలో యజ్ఞ,దాన, వేదాధ్యయణ, తపస్సుల వలన నేను తెలియనని చెప్పగా, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేఖముగా చేయువారిని స్వాములనాలా? బాబాలనాలా? పీఠాధిపతులనాలా? విశిష్ట జ్ఞానులనాలా? ఏమనాలో విూరే చెప్పండి?

767. నీ అధికారము, నీ హోదా, నీ పలుకుబడి, నీ ఉద్యోగము మధ్యలోవచ్చి మధ్యలో పోవునవే. వాటిని చూచి మిడిసిపడకు నీ శరీరము కూడా నీ మాటవినని రోజుంది జాగ్రత్త!

768. అందరికి అధికారి ఒక్కడు కలడు. అతను చెప్పకనే నడిపించును, చూపకనే చేయించును, కనిపించకనే నీ వెంట ఉండును. అతనే ఎవరికి తెలియని దేవుడు.