పుట:Prabodha Tarangalul.pdf/89

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మాటలూ బయటపడును. అలాగే తలలో కనిపించకుండిన కర్మ జీవితములో జరుగుకొలది బయటపడును.

719. ఒక డి.వి.డి ప్లేట్‌లో తొమ్మిది గంటలకాలము మూడు సినిమాలు నిక్షిప్తమై ఉన్నవి. అలాంటపుడు స్పెషల్‌ డి.వి.డి లాంటి నీ తలలో ఎంత కాలము? ఎంత సమాచారము ఇమిడియున్నదో.

720. మానవుని చేత తయారు చేయబడిన కంప్యూటర్‌లోని చిన్న భాగమైన హార్డ్‌ డిస్క్‌లో వేయి పేజీల పుస్తకములు వేయికంటే ఎక్కువ ఇమిడి ఉన్నపుడు, దేవుడు చేసిన కంప్యూటర్‌ అయిన మానవుని తలలో కోట్ల సంవత్సరముల సమాచారముండగలదు.

721. నీలో ఐదు ప్రాణములున్నవి. వాటిలో ఒక్క ప్రాణము కూడ నీవు కాదు. నీవు వేరు, నీప్రాణము వేరు. నీవు జీవాత్మవు.

722. ఏదయిన దేవుని సొమ్ముగ లెక్కించినపుడు దానిలో ఎంత భాగము కూడ పంచుకోకూడదు. అలాచేస్తే దేవున్ని కూడ భాగస్తునిగ లెక్కించినట్లగును.

723. మనము చేసే వ్యాపారములో మనుషులను భాగస్తులుగ పెట్టుకోవచ్చును. కానీ దేవున్ని భాగస్థునిగ పెట్టుకోకూడదు. అలాచేస్తే దేవుని గొప్పతనాన్ని తగ్గించినట్లగును.

724. దేవునికి ఎవడైన సేవకునిగానే ఉండవలెను, అట్లున్నపుడే దేవున్ని గౌరవించినట్లగును. అందువలన నీ వ్యాపారములో దేవునికి ఎప్పుడు వాటా పెట్టవద్దు.