పుట:Prabodha Tarangalul.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీవు రోగముతో బాధపడుచుంటే ప్రక్కనే ఉండి చూడగలరు. కానీ నీ బాధను కొద్దిగ కూడ వారు తీసుకోలేరు.

712. బయటి విద్యలలో ఎంతటి స్పెషలిస్టులైనాగానీ శరీరములోని తుస్సువలెనున్న మనస్సునుగానీ తస్సువలెనున్న అహమునుగానీ తెలియలేకున్నారు.

713. గాజు అద్దము బయటి నీ శరీరమును మాత్రము చూపుతుంది. కానీ అహమను అద్దము లోపల ఏకంగా నీ భావమును చూపుచున్నది. దానితో నేను మాత్రమున్నాననుకొంటున్నావు.

714. పాటను బాగా పాడితే నేను గాయకుడిననీ, బొమ్మను బాగా గీస్తే నేను చిత్రకారుడిననీ అనుకొను నీవు నిన్ను పాట పాడించింది, నీతో బొమ్మ గీయించింది మరొకడని తెలియకున్నావు.

715. ఒక మనిషి ఒక విద్యలో ప్రావీణ్యుడైనాడంటే ఆ ప్రావీణ్యత వానిదికాదు. శరీరము లోపలనున్న వాని ప్రక్కవానిది.

716. శరీరమను ఊరులో నీ ప్రక్కనే నివాసమున్న వాడే నిజమైన నీ పొరుగువాడు. అయినా నీవు వానితో స్నేహము చేయడములేదు.

717. ఉన్నతమైన ఉద్యోగములో ఉండేవాడే నీతో మాట్లాడక వాని హోదాకు తగినట్లుండును. అయినా స్వప్నములో ప్రధానిమంత్రియే స్వయముగ నీతో మాట్లాడును. స్వప్నములో ఆ సంఘటన ఎలా సాధ్యమైనదో నీకు తెలుసా?

718. వి.సీ.డీ ప్లేట్‌ను గమనిస్తే అందులో ఏమి కనిపించదు. కానీ అది ప్లేయర్‌లో తిరుగుచున్నపుడు అందులో ఉన్న దృశ్యములూ