పుట:Prabodha Tarangalul.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


426. వేదములు చెప్పువాడు వేదములలోనే ధర్మములున్నవని అంటున్నాడు, యజ్ఞములు చేయువాడు వాటిలోనే ధర్మములున్నవి అంటున్నాడు. కాని దేవుడు ఆమాటను అనలేదు.

427. ధర్మమునకు దైవమార్గము తెలుపు సామత్యమున్నది. ధర్మము పవిత్రమైనది, కానీ మాయ ప్రభావము వలన అధర్మములు ధర్మములుగ, ధర్మములు అధర్మములుగ గోచరించుచున్నవి.

428. ధర్మమునకు ముప్పుకల్గితే వాటిని దేవుడే రక్షిస్తానన్నాడు. మానవుడు ధర్మములను ఆచరించుటకు యోగ్యుడే కాని రక్షించుటకు యోగ్యుడు కాదు.

429. ధర్మమంటే ఏమిటో తెలియకనే వాటిని గురించి వక్రీకరించి చెప్పితే అది దైవవ్యతిరేఖమగును.

430. ధర్మమెచట గలదో అధర్మము అచటనే పుట్టినది. వేదాంత మెచట గలదో వేదములచటే గలవు. వేదాంతము గుణాతీతము కాగ వేదము గుణమయమయినది.

431. ధర్మమునకు వ్యతిరిక్త పదము అధర్మము కాదు. జ్ఞానమునకు వ్యతిరేఖ పదము అజ్ఞానము కాదు.

432. ధర్మమునకు వ్యతిరేఖము గుణములు, జ్ఞానమునకు వ్యతిరేఖ పదము మాయ, పరమాత్మకు వ్యతిరేఖ పదము ప్రకృతి.

433. ధర్మము, జ్ఞానము పరమాత్మమయమైనవి. గుణములు, మాయ ప్రకృతిమయమైనవి.