పుట:Prabodha Tarangalul.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

418. ధర్మము చేస్తే పుణ్యము రాదు, మరు జన్మరాదు. అందువలన ధర్మమును ఆచరించమని గీతయందు భగవంతుడు చెప్పాడు.

419. దానధర్మముల వ్యత్యాసము తెలియనివాడు దైవమార్గమును తెలియలేడు.

420. ఆత్మకున్న విధానములు ధర్మములు, దైవమును తెలియుటకు ఆచరించవలసినవి ధర్మములు. అందువలన ధర్మములు జ్ఞానముతో కూడుకొన్నవి.

421. ఎచట అజ్ఞాన విధానములున్నవో అచట అధర్మములున్నవని తెలియవచ్చును.

422. అణువణువున వ్యాపించియున్న పరమాత్మను తెలియక మరి ఏ విధానమును ఆచరించినా, ఏ దేవతలను ఆరాధించిన అది అధర్మమే అగును.

423. భగవద్గీతలో శరీరము ధరించిన భగవంతునిగ మరియు శరీరమే లేని పరమాత్మగ (విశ్వరూపములో) ఒక ముఖ్యమైన ధర్మము తెలియజేశాడు. అది ఏమనగా! "బాహ్యయజ్ఞముల వలనను, దానముల వలనను, వేదాధ్యాయనముల వలనను, ఉగ్రమైన తపస్సుల వలనను నేను తెలియబడను" అన్నాడు.

424. వేదపారాయణము, యజ్ఞములు చేయుట, దానములు, తపస్సులు ధర్మయుక్తములు కావని భగవంతుని మాటలలో తెలియుచున్నది.

425. పనిచేయు ప్రతివాడు తనది ధర్మమే అనుకొనుచున్నాడు. అసలు ధర్మమంటే ఏమిటో ఆలోచించలేదు.