పుట:Prabodha Tarangalul.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

165. ఆత్మ యోగసాధనకుతప్ప మిగతా వ్రత క్రతువులకు, తపస్సులకు, వేదపారాయణకు మరి ఏ ఇతర ఆచరణకు తెలియదు.

166. ఆత్మను తెలుసుకొన్నంత మాత్రముననే ముక్తిలేదు. కర్మనాశనము అయినపుడే ముక్తి.

167. అహమొక్కటియే కర్మ రహితమునకు, కర్మ సహితమునకు కారణము.

168. మనసొక్కటియే గుణ రహితమునకు, గుణ సహితమునకు కారణము.

169. భగవంతుడు సాకారుడు, పరమాత్మ నిరాకారుడు.

170. ప్రతికార్యము గుణము వలన, ప్రతి గుణము కర్మ వలన, ప్రతికర్మ కార్యము వలన కల్గుచున్నది. అందువలన జీవుడు చావు పుట్టుకలను చక్రమందు తిరుగుచున్నాడు.

171. జ్ఞానేంద్రియ విషయాల జ్ఞప్తియే నీలోని మనస్సు.

172. శరీరములోనికి జీవుడు ఎట్లు వచ్చునది తెలియని వారికి శరీరములోనుండి జీవము ఎట్లు పోవునది కూడా తెలియదు.

173. శరీరములో ఉన్నంత కాలము ఎంతటి యోగికాని పరమాత్మను తెలియలేడు.

174. ప్రకృతి కార్యములు స్వధర్మమనుకోకు, ఆత్మ కార్యములే స్వధర్మమని తెలుసుకో.

175. పాపములలో క్షమించబడు పాపము, క్షమించరాని పాపము అని రెండు విధములు గలవు.