పుట:Prabodha Tarangalul.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176. లింగమొక్కటే అయినా అది మూడు విధములు. అంగమొక్కటే అయినా అది ఐదు విధములు.

177. తండ్రి శరీరానికి పుట్టేవారు పుత్రులు. గురువు జ్ఞానముతో తయారగువారు జ్ఞానపుత్రులు.

178. అయిన పనులకు నేను, కాని పనులకు కర్మయనకు. అన్నిటికి కర్మే కారణము.

179. ధర్మార్థ కామ మోక్షములనుట అసత్యము. కామార్థ ధర్మమోక్షములనుట సత్యము. ధర్మము వలన డబ్బు కామము వలన మోక్షము వచ్చుట అసత్యము.

180. ధర్మము వలన మోక్షము, కామము వలన ధనము లభ్యమగును.

181. నీ శరీరములో ప్రతి కదలిక ఆత్మదైనా అది కర్మననుసరించియే ఉండును.

182. ఆత్మ బయట లేదు. శరీరములందు ఉన్నదని గ్రహించు.

183. మరణములో ఆత్మ, జీవాత్మలు పోయిన శరీరములో మిగిలియున్నది పరమాత్మ ఒక్కటియేనని గ్రహించు.

184. "ధనమూల మిదమ్‌ జగత్‌" అంటారు. ఆ ధనమునకు కూడ కారణము కర్మే కావున కర్మమూల మిదమ్‌ జగత్‌ అను మాట సత్యమైనది మరియు సరియైనది.

185. బిడ్డకు తండ్రి ఎవరో తల్లికి తెలిసినట్లు, జీవునకు దేవుడెవడో గురువుకు మాత్రము తెలియును.