పుట:Prabodha Tarangalul.pdf/101

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఎదుటివాని భావమును చెడుదనియే అనుకొనుచుండును.

791. ఎంత అజ్ఞాని అయినా ఇతరులతో నేను జ్ఞానిననే చెప్పుకొనుచుండును. అదే విధముగా ఎంత ధనికుడైన ఇతరులతో నేను బీదవాడినేనని చెప్పుకొనుచుండును.

792. సమాజసేవ అని కొందరనుచుందురు. సమాజమంటే ఏమిటో తనకు తెలిసినది సమాజమో కాదో మొదట ఆలోచించుకోవాలి.

793. మనిషికి బయట సమాజమని లోపలి సమాజమని రెండు సమాజములు కలవు. ఒకటి నీకవసరము, రెండవది నీకనవసరము.

794. కన్ను తెరిస్తే దృశ్యము (వెలుగు) కన్ను మూస్తే చీకటి కన్ను వెనుకల వెలుగు చీకట్లను చూచేవాడెవడు? చూపేవాడెవడు? తెలుసా?

795. ఏ ఊరికి పోయినా నీ ఊరిలోని భూమి, గాలి ఉన్నట్లు అక్కడ కూడా అవియే కలవు. అదే విధముగా ఏ శరీరమును చేరి చూచినా ముందున్న శరీరములోనివే కలవు.

796. ఎలుక పిల్లిని చూస్తే భయపడుతుంది. పిల్లి కుక్కను చూస్తే భయపడుతుంది. కుక్క పులిని చూస్తే భయపడుతుంది. పులి మనిషిని చూస్తే భయపడుతుంది. ఇలా అందరిలోను భయము పాదుకొని ఉంది.

797. భయము పరధర్మమైన ప్రకృతిధర్మము, ధైర్యము స్వధర్మమైన పరమాత్మ ధర్మము.