పుట:Prabodha Tarangalul.pdf/100

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


783. దేవుడు ఒక్కడే భూమివిూద గురువుగ ఉండగలడు. కాని మనిషి గురువుగా ఎప్పటికి ఉండలేడు. మనిషి బోధకునిగా ఉండవచ్చును.

784. ఈ దినములలో భూమివిూద ఉన్న స్వావిూజీలందరిలో ఎవడైన గురువు ఉన్నాడా? అని ప్రశ్నిస్తే నిజం చెప్పాలంటే చాలా కష్టము.

785. పుస్తకములన్ని శాస్త్రములుకావు. కొన్ని చరిత్రలు, కొన్ని పురాణములు, కొన్ని కావ్యములుగా ఉన్నవి. అలాగే మనుషులందరు జ్ఞానులుకారు. వారిలో కొందరు రౌడీలు, కొందరు దొంగలు, కొందరు జూదరులున్నారు.

786. దేవున్ని తప్ప ఇతర దేవతలనుగాని, మాయనుగాని ఆరాధించవద్దని చెప్పునది అసలైన జ్ఞానము.

787. మనుషులు దేవుని జ్ఞానమును అర్థము చేసుకోలేకపోవడము వలననే అన్ని అనర్థములకు కారణమైన హింసలు, దోపిడీలు అవినీతి అక్రమములు మనుషులలో చెలరేగుచున్నవి.

788. హింసతోగానీ, భయపెట్టిగానీ ఎవరిని మార్చలేము. జ్ఞానమును బోధించి ఎవరినైన, ఎంతటి మూర్ఖున్ని అయిన మార్చవచ్చును.

789. భయపెట్టి బయట మార్చగలము కాని లోపల మార్చలేము. భయముతో ఎవడైన బయట మారినట్లు నటించును కాని లోపల తన స్వభావమును వదిలిపెట్టడు.

790. ఎవడైన తన స్వభావమును మంచిదనే అనుకొనుచుండును.