పుట:Prabhutvamu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

ప్రభుత్వము

క్షుడు పునర్నిర్వచనము పేరుపెట్టుకొని 1884 నుండి 1916 వరకు అనగా 32 సంవత్సరములు రాజ్యమేలుట సంభవించినది. ఇతనిపేరు 'పొర్‌ఫిరియోడయజ్'. ఇతని పరిపాలన ప్రజలకు శాంతిప్రదముగానే యుండినది. ఇతనికి తదనంతరము మెక్సికోలో అంతఃకలహములు ప్రతిదిన చర్యలైపోయెను. 1921 నుండి 1930 లోపల పదునొకండుగురు అధ్యక్షులు మారిపోయిరి. ఇప్పటి కింకను 'మెక్సికో'కు స్థిమితములేదు. దీర్ఘ కాలము రాజ్యమేలునట్టి యధ్యక్షులందరును 'డయజ్ 'వలె సమర్థులుకారు. మనసంస్థల స్థితిగతులెరింగిన వారికి ఈ విషయ మొక కొంచెము ఎక్కువగా నర్థము కావచ్చును. పేరు నిర్వచనము. కాని నిర్వచించుటయందు పలుకుబడికలవారు పరమమిత్రులు. ఎల్ల మార్గములును అనుసరణీయములు. పదవి ఏదైనను, సామాన్యసభ యొక్క కార్యదర్శిత్వమైనను సరియే, పట్టణపాలకసంఘాధ్యక్షాదిక పదవులలో నొకటియైననుసరియే- నిర్వచితుడైనవాడే నిర్వచితుడగుచున్నాడు. పని చేయనీ, చేయకపోనీ ఆగొడవతో నక్కరయే లేదు. సంస్థనిలువనీ నీల్గనీ అదియును నాలోచనలోనికి రాదు. ఇట్టిస్థితి మాత్రముతగదు.

ఉత్తమాధికారినియామకమందు పైసూత్రములన్నిటికిని భిన్నముగా ప్రవర్తించు చిత్రమగు చిన్న రాష్ట్ర మొకటియున్నది. అది “సాన్ మెరినో”. అందు 12000 ప్రజలున్నారు. వారు 60 మంది శాసనకర్తల నెన్నుకొందురు. వారిలో నిద్దరిని 'రీజెంటులు' గా, పరిపాలకులుగా నిర్వచింతురు. వీరొక్కక్క రారు మాసములు