పుట:Prabhutvamu.pdf/76

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్వహణస్వరూపము

75

నట్లుగా కాలపరిమితిని నియమించి యున్నవి.

ఒక్క సారి ఉత్తమాధికారమునకు వచ్చినవాడు మరల మరల వచ్చుచుండుటకు అవకాశము ఉండతగిన దేనా యనుప్రశ్న కొందరకు దోచవచ్చును. అధ్యక్షుడుగానుండి ప్రతిభావంతుడై దేశసేవ బాగుగా చేసినయట్టి యాతడు మరల తత్సేవకు నర్హుడు కాకపోవుట దేశమునకు లాభదాయకము కాదనుట నిజమే, అయిన మరల నధికారము వహించుట కర్హుడు అను నాధారముండెనేని అధికారమునకువచ్చినవాడు అధికారమును మరల సంపాదింపవలయునను నాశమై ప్రజలలో నెక్కువమందికి రుచికరముకాని కార్యము తనకు న్యాయమని తోచినప్పటికిని చేయక మానివేయ వచ్చునుగదా ! చేయరాని కార్యములును చేయవచ్చును గదా! అయిన పునర్నిర్వచనము అఖండముగా నెచ్చటను నేర్పడలేదు. అమెరికాసంయుక్తరాష్ట్రములలో పునర్నిర్వచనమువిషయమై రాజ్యాంగ శాసనములలో నేమియు చెప్పబడియుండలేదు. కాని అచ్చట ఆచారమున నొక సిద్ధాంత మిప్పటి కేర్పడి యున్నది. మొదటి యధ్యక్షుడు పునర్నిర్వచనమునందెనుగాని రెండుపర్యాయముల కంటె నెక్కువగా నధ్యక్షకపదవియం దుండనని నిరాకరించెను. అది నేటికి సూత్రమయినది. రెండు పర్యాయములకంటె నేయధ్యక్షుడును నిర్వచితుడగుటలేదు. పరాసుభూమిలో అధ్యక్షుడు పునర్నిర్వచితుడు కాకూడదను సిద్ధాంతములేదు. పునర్నిర్వచితుడు కాదలచుకొనిన కావచ్చును. కాని అచ్చట నట్టి పునర్నిర్వచనముజరిగినదే లేదు. ఒక్క మెక్సికోలో మాత్రము అధ్య