పుట:Prabhutvamu.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసననిర్వహణస్వరూపము

71

యందున్నది. దక్షిణఅమెరికాలోని పెరు, బ్రెజిలు ఇత్యాది రాజ్యములయందుమాత్రము ఈ పద్ధతి యవలంబింప బడుచున్నది. అమెరికాసంయుక్త రాష్ట్రమునందు పేరునకు పరోక్షపద్ధతి యనుసరించు చున్నారు గాని నిజమున కది ప్రత్యక్షపద్ధతియే యని చెప్పవలసియున్నది. ప్రజలు ప్రత్యేకముగా నిర్వాచకులను నెన్నుకొనుచున్నారు. వారు అధ్యక్షుని నెన్నుకొనవలసి యుందురు. ఇది సంయుక్తరాష్ట్రములకు నేర్పడియుండు విధానము. ఈ విధముగా పరోక్షనిర్వచనపద్ధతి అచ్చటనేర్పడి యున్నను అచ్చట ఈపరోక్షనిర్వచనపద్ధతి నిజముగా పరోక్షపద్ధతి మాత్రముకాదు. ఏలయన, అమెరికాసంయుక్తరాష్ట్రములలో 'కక్షలు' పరిపూర్ణముగా నేర్పడియున్నవి. ఒక్కొక్క కక్షికిని మండలము మండలములోను, గ్రామము గ్రామములోను తప్పక సంస్థలు నెలకొనియున్నవి. నిర్వచనాధికారము కలవాడొక్కడును ఈసంస్థలలో నేదో యొక సంస్థకు చేరనివాడులేడు. ఎప్పుడు అధ్యక్షుని నియామకము కావలసియున్నను ఈ కక్షలవారు గొప్పసమావేశములలో, అనగా రాష్ట్రీయసమా వేశములలో చేరి ఎవ్వ డధ్యక్షుడుగానుండ నర్హుడో అతనిని బేర్కొనుచున్నారు. తరువాత ఆకక్షికి చేరిన వారందరును ఆతనినే అధ్యక్షుడుగా నిర్ణయించి కావలెను. అందుచేత నామకార్థముఅధ్యక్షక నిర్వాచకులుగా నేర్పడు మధ్యవర్తులగు ప్రత్యేక నిర్వాచకులును కక్షిచే నియమితుడగు వానినే నిర్వచింపకతప్పదు. ఈకారణముచేత ఇటీవల అమెరికా సంయుక్తరాష్ట్రములలో నొకక్రొత్తయుద్యమము ప్రారంభ