పుట:Prabhutvamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

ప్రభుత్వము

శాసనసభలు రెంటి యెన్నికలలోను ఈపార్టీ మొత్తము మెంబర్లనుపేర్కొని జాబితాచేయును. వోటరులు ఈ జాబితాను మొత్తముగా అంగీకరింపనైనను అంగీకరింపవలెను. తిరస్కరింపనైనను తిరస్కరింప వలెను. ఇతని పార్టీ బలమున్నంతసేపు అంగీకరింపకుండుటకు వీలెక్కడిది!

పరంపరాగతపద్ధతి యింకను జపాను, పర్షియా, బెల్జియము, బల్గేరియా, డెన్మార్కు, ఈజిప్టు, మెసొపొటేమియూ, ఇటలీ, హాలండు, రుమేనియా, సయాము, యూగోస్లేవియా మున్నగు స్వతంత్రరాష్ట్రములలోను బ్రిటిషువారికి, ఫ్రెంచివారికి మున్నగు అయిరోపియను రాష్ట్రములకు లోబడిన సామంతరాజులు ప్రభువులుకలచోట్లను కొంతకుకొంతయో పూర్ణముగానో ప్రచారమందున్నది. ఇందు కొన్నికొన్నిట ప్రజాపరిపాలన వేరునాటి పరంపరాగతపద్ధతియొక్క నిరంకుశత్వము మట్టు పడినది. కొన్నిట ఇంకను మట్టుపడలేదు. మహాసంగ్రామము కారణముగా రుష్యా, యిత్యాది రాజ్యముల ప్రభువులు పలాయితులయినారు. ప్రజాధికారము స్థాపితమగుటకు మహత్తరమయిన యల్లకల్లోలములు జరిగినవి, జరుగుచున్నవి.

ప్రజలు ఉత్తమాధికారిని నిర్వచించుకొను చోట్ల విధానములు భిన్నములుగా నున్నవి. శిష్టసభలకు ప్రతినిధులను నెన్నుకొనుటకు నేర్పడి యుండు ప్రత్యక్షపరోక్ష నిర్వచనపద్ధతులు రెండును నీయుత్తమాధికారినిర్వచనమునందు వినియోగపడుచున్నవి,

ఉత్తమాధికారిని ప్రజలే నేరుగా నెన్నుకొనుపద్ధతి అముఖ్యములైన కొన్ని రాజ్యములలోమాత్రము వ్యాప్తి