పుట:Prabhutvamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

ప్రభుత్వము

ఇప్పటికిని పరంపరాగతముగా నేర్పడురాజులు గలరు. కొన్ని రాజ్యములయందు స్త్రీలు సింహాసనమునకు రానర్హులుకారు. పురుషసంతతిలోనివారే రాజ్యాధికారనిర్వహణమునకు నర్హులు. స్త్రీలో పురుషులో ఎవ్వరు అధికారము వహించు వారై నను నేటిదినము నాగరికరాష్ట్రములలో పరంపరాగతప్రభువుల శాయశక్తులు మిక్కిలి సంకుచితములై యున్నవి. ఆంగ్లభూమిలో రాజు కలడు. అతడే మన చక్రవర్తి. కాని యూతనికి ఏవిధమగు నధికారమునులేదు. అతనికి రాజకీయవిషయము లలో ప్రత్యేకవ్యక్తిత్వమేలేదని చెప్పవచ్చును. రాజ్యములోని సర్వాంగములును మంత్రుల యధీనమునం దుండును. రాజుకి కన్ను, కాలు, చేయి, మెదడు సర్వమును ఈ మంత్రివర్గమే. మహాసంగ్రామము నందోడి తలదాచుకొనువరకును జర్మనీలోను సామ్రాట్టుండినాడు. అతడును సామ్రాజ్యములోని శిష్టసభకు సంపూర్ణముగా నంకితుడు. కాని అందులో చేరిన ప్రష్యాదేశమునకు నతడు నిరంకుశు డైన ప్రభువుగానున్నందున శిష్టసభలో నతనికి పలుకుబడి యెక్కువ. ఇదిగాక సామ్రాజ్యముఖ్య మంత్రిని నియమించుకొను నధికారమును అతనికి కలదు. ఆముఖ్యమంత్రి ప్రజలకు జవాబుదారీ పడువాడుగాడు, చక్రవర్తికే జవాబుదారీపడువాడు. ఈకారణములచేత జర్మనీ కేయిజరుయొక్క శాయశక్తులు మహాద్భుతముగా నుండినవి. నిరంకుశమగు నధికారవర్గమును నియమించి అతడు సామ్రాజ్యమును ఇష్ట ప్రకారము పరిపాలించుచుండినాడు. నేడు జర్మనీలో కెయిజరులేడు. అతనికి తరువాత నేర్పడిన యుత్తమాధికారియు